ఆ రోడ్డుకు అక్కినేని నాగేశ్వరరావు పేరు

అన్నపూర్ణ స్టూడియో మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుండి జూబ్లీ హిల్స్ రోడ్ నెం.5 వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు దానం నాగేందర్ గురువారం శంఖుస్థాపన చేసారు. రూ. 7.2 కోట్ల ఖర్చుతో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ రోడ్డుకు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన ఆయన జ్ఞాపకార్థం ఫిల్మ్ నగర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నాగేశ్వరరావుపై ఇటీవల పోస్టల్ శాఖ వారు స్టాంపు కూడా విడుదల చేసారు.
తన సినీ వారసులతో కలిసి అక్కినేని నటించిన చివరి సినిమా 'మనం' చిత్రం త్వరలో విడుదల కానుంది. అక్కినేని చివరి సినిమా కావడంతో ఈ సినిమాను తప్పకుండా చూసేందుకు పలువురు అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మార్చి నెలలో ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











