అవార్డులపై నానా పటేకర్ ఫైర్
ఆయన మాట్లాడుతూ... ''ఎవరైనా ఎక్కడైనా ఒక సంస్థను ఏర్పాటు చేయవచ్చు. జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయవచ్చు. వారు కూడా అలాంటి పురస్కారాలను స్వీకరించవచ్చు'' అని ఫలానా వారు అంటూ పేరు ప్రస్తావించకుండా నానా పటేకర్ ఎద్దేవా చేశారు.
''అవార్డులు తీసుకోవటం అనేది నేరం కాదు.. కానీ నేను మాత్రం అలాంటి పురస్కారాలు స్వీకరించను.. నా జీవితాన్ని మీరు ఒక లక్ష.. ఐదు లక్షలు.. 10 లక్షల రూపాయలకు ఎలా వెల కడతారు?'' అని పటేకర్ విమర్శలు గుప్పించారు.
సాధారణంగా ఏదైనా నిర్దేశిత రంగంలో యావత్ కెరీర్‌లో అందించిన సేవలకు గుర్తింపుగా లైఫ్ టైమ్ అవార్డులను వ్యక్తులకు అందిస్తుంటారు. ఎక్కువగా సిని పరిశ్రమ వారికి ఇచ్చే అవార్డులను మీడియా హైలెట్ చేస్తూంటుంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రెవేట్ సంస్ధలు ఈ తరహా అవార్డులను ఇస్తున్నాయి.
డిల్లీ గ్యాంగ్ రేప్ విషయమై ఆయన మాట్లాడుతూ... సమాజం ఇలాంటి సంఘటనలతో సిగ్గుపడాలి అన్నారు. కేవలం క్యాండిల్స్ వెలిగించటం వల్ల సమస్య సాల్వ్ కాదు. క్యాండిల్స్ ఆయుధాలుగా మారాలని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications
