For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏం తెలుసు వాళ్ల బొంద, నోరూ మూయించా, లిమిట్ దాటేతే దబ్బిడిదిబ్బిడే : బాలకృష్ణ

  By Bojja Kumar
  |

  'పైసా వసూల్' చిత్రాన్ని అన్ని ఎలిమెంట్స్ కలిసి ఒక విందు భోజనంలా పూరి జగన్నాథ్ తయారు చేశారని.... 'శాతకర్ణి' తర్వాత ఒక డిఫరెంట్ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని చేసినట్లు బాలకృష్ణ తెలిపారు.

  తన సినిమాలపై పైరసీ ప్రభావం పెద్దగా ఉండదని, నా సినిమాలు లార్జ్ స్క్రీన్ మీద చూస్తేనే మజా. అందుకే నా సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద సందడి సందడిగా ఉంటుంది అని బాలయ్య తెలిపారు. ఇపుడు 'పైసా వసూల్' చిత్రం విషయంలో కూడా పరిస్థితి అలాగే ఉంది అన్నారు.

  నా సినిమాలతోనే మొదలైంది

  నా సినిమాలతోనే మొదలైంది

  మల్టీప్లెక్సుల్లో ఈలలు కొట్టడం, డబ్బులు విసరడం, రంగు కాగితాలు విసరడం నా సినిమాతోనే మొదలైంది. ఒక లెజెండ్ తో కంటిన్యూ అవుతోంది. శ్రీరామరాజ్యం దేవుడి సినిమా అని కూడా మరిచిపోయి చప్పట్లు. రంగు కాగితాలు, డబ్బులు వేశారు. ఇది నిజమా అని మేము కూడా గిల్లుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు... అని బాలయ్య ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.

  లాభాపేక్ష ఉండదు

  లాభాపేక్ష ఉండదు

  నేను వర్క్ హాలిక్. రాజకీయాలు, సినిమాలను నేను బాధ్యతగా, బరువుగా భావించను. అదృష్ణవశాత్తు దక్కిన అవకాశంగా భావించి సంతృప్తితో పని చేయడం తప్ప వేరే లాభా పేక్షనాకు ఉండదు అని బాలయ్య తెలిపారు.

  ఫ్యాన్స్‌కి నాకు మధ్య వాడు ఔట్ సైడర్

  ఫ్యాన్స్‌కి నాకు మధ్య వాడు ఔట్ సైడర్

  అభిమానులపై చేయి చేసుకున్నారనే విమర్శలపై బాలయ్య స్పందిస్తూ..... ‘నా చేయి తగిలితే వాళ్లకి కూడా ఆనందమే. ఇదే విషయం వాళ్లని అడిగితే బాలయ్య నన్ను కొట్టాడురా అని ఆనందంగా చెప్పుకుంటాడు. నేను కారణం లేకుండా కొట్టను. అవతలోడు రెచ్చగొట్టాలి, లేదా తప్పు చేయాలి... రాసేవాడికి ఏం తెలుసు వాళ్ల బొంద. ఫ్యాన్స్ కు నాకు మధ్య వాడు ఔట్ సైడర్' అని బాలయ్య వ్యాఖ్యానించారు.

  అందరి నోరూ మూయించా

  అందరి నోరూ మూయించా

  ‘ఎన్టీఆర్ బయోపిక్‌లో నాన్నగారి జీవిత సారాంశం ఉంటుంది. సినిమా ఎక్కడ మొదలు పెడతారు. ఎక్కడ ముగిస్తారు. కాంట్రవర్సీలు ఉంటాయా? ఇలా చాలా అడుగుతున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసు అని అలా అడుగుతున్న వారి అందరి నోరు ఒకే దెబ్బతో మూయించా.' అని బాలయ్య అన్నారు.

  లిమిట్ దాటితే వాడికి దబ్బిడి దిబ్బిడే

  లిమిట్ దాటితే వాడికి దబ్బిడి దిబ్బిడే

  నాన్నగారి బయోపిక్ అయినా లేదా ఇంకేదైనా..... నా ముందు లిమిట్ లో మాట్లాడాలి. అదిదాటి ఎక్కువ వాగితే అయిపోయారే వాళ్లు. ఎవడు వాగుతాడో వాడికి దబ్బిడిదిబ్బిడే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. నాన్నగారి బయోపిక్ చిత్రానికి దర్శకుడు ఎవరినీ అనుకోలేదు. ఆ పని మీదే ఉన్నాను. త్వరలోనే ప్రకటిస్తాను అని బాలయ్య తెలిపారు.

  అమితాబ్ ఉంటే రైతు చేయాలనుకున్నా

  అమితాబ్ ఉంటే రైతు చేయాలనుకున్నా

  ‘శాతకర్ణి' కంటే ముందే ‘రైతు' చేద్దామనుకున్నాను. కాస్టింగ్ కుదరకే హోల్డ్‌లో పెట్టాం. అమితాబ్ చేస్తే చేయాలనుకున్నాను. కానీ కాస్టింగ్ కుదరలేదు. అమితాబ్ రాజకీయ కారణాల వల్ల అప్పుడు ఒప్పుకోలేదు. ప్రెసిడెంట్ రేసులో ఆయన పేరు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల అప్పుడు చేయలేనన్నాను. కాస్టింగ్ కుదిరితే ఈ సినిమా తప్పకుండా చేస్తాం అని బాలయ్య తెలిపారు.

  ఏ హీరో కూడా చేయడు

  ఏ హీరో కూడా చేయడు

  ఏ హీరో కూడా తన గురించి తానే పాట పాడుకోడు. కానీ నేను పాడాను. ఎవరూ చేయని పని చేయాలనే అలా చేశాం. అభిమానులకు ఆ పాట బాగా నచ్చుతోంది.... అన్నారు.

  మోక్షజ్ఞ వచ్చే ఏడాది

  మోక్షజ్ఞ వచ్చే ఏడాది

  మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది జూన్ తర్వాత ఉంటుంది. సమయం వచ్చినపుడు అందుకు సంబంధించిన వివరాలు చెబుతాను అని బాలయ్య తెలిపారు.

  పూరిలో ఆ అవతారం చూడలేదు

  పూరిలో ఆ అవతారం చూడలేదు

  పూరిలో రెబల్ అవతారాన్ని ఎప్పుడూ చూలేదు. నాతో బాగానే ఉన్నారు. ‘పైసా వసూల్' షూటింగ్ అంతా ఫ్రెండ్లీగా, కూల్ గా సాగిపోయింది అని బాలయ్య తెలిపారు.

  విజయవాడలో 400 కోట్లతో...

  విజయవాడలో 400 కోట్లతో...

  నేను ఉంటే సినిమా షూటింగులో, లేక పోతే హిందూపురంలో, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారాల్లో ఉంటాను. ఇటీవలే ఆసుపత్రిలో 7 కోట్లతో రోబోటిక్ సర్జరీ అప్ గ్రేడ్ చేశాం. రేపు విజయవాడలో కూడా ఈ ఆసుపత్రి పెట్టాలి. దానికి 400 కోట్లు ఖర్చవుతుంది. మాదేమో ట్రస్టు. డబ్బుల్లేవు...... నిధులు ఎలా సమకూర్చడం అనే విషయంలో ఎప్పటికప్పుడు బోర్డు డైరెక్టర్లతో చర్చిస్తూ ఉంటాం. నాకు నా ప్రేక్షకులే దేవుళ్లు. నా వంతు సేవ, వినోదాన్న పంచడమే నా జీవిత లక్ష్యం... బాలయ్య తెలిపారు.

  English summary
  Nandamuri Balakrishna about Slapping Fans in Public at Paisa Vasool interview said his fans feel happy for touching them. He said he knows the reason why he slapped and he don't care about others. Nandamuri Balakrishna about Slapping Fans in Public at Paisa Vasool interview said his fans feel happy for touching them. He said he knows the reason why he slapped and he don't care about others.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X