For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బయటపడ్డ బాలకృష్ణ నిజస్వరూపం: అభిమానికి కాల్ చేసి అంత మాట.. నటసింహా కాల్ రికార్డ్ వైరల్

  |

  నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో హవాను చూపిస్తోన్న ఆయన.. విభిన్నమైన చిత్రాలతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగులో ఏ హీరోకూ లేని విధంగా ఆయన పేరుపైనే ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య తన అభిమానికి కాల్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  హ్యాట్రిక్ ఫ్లాపులు.. అస్సలు తగ్గని బాలయ్య

  హ్యాట్రిక్ ఫ్లాపులు.. అస్సలు తగ్గని బాలయ్య

  జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా 2019లో ఆయన ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, అవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని బాలయ్య.. మరిన్ని ప్రాజెక్టును లైన్‌లో పెడుతున్నారు.

  హిట్ కొట్టేందుకు మరోసారి... గర్జిస్తున్నాడు

  హిట్ కొట్టేందుకు మరోసారి... గర్జిస్తున్నాడు

  వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న బాలయ్య.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో మరోసారి జతకట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  బాలయ్య కెరీర్‌లోనే ప్రత్యేకంగా.. గ్రాండ్‌గానే

  బాలయ్య కెరీర్‌లోనే ప్రత్యేకంగా.. గ్రాండ్‌గానే

  ఇక, ఈ సినిమాను బాలకృష్ణ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో ఎంతో మంది బడా నటులను తీసుకున్నారు. అలాగే, ఈ మూవీలో నటసింహం అఘోరా పాత్రలోనూ కనిపించబోతున్నారు. వీటితో పాటు ఈ మూవీతో హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో సాహసాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది.

  ఎనర్జిటిక్ డైరెక్టర్‌తో జతకట్టనున్న బాలయ్య

  ఎనర్జిటిక్ డైరెక్టర్‌తో జతకట్టనున్న బాలయ్య

  బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పట్టాలపై ఉండగానే.. ‘క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  బయటపడ్డ నందమూరి హీరో నిజస్వరూపం

  బయటపడ్డ నందమూరి హీరో నిజస్వరూపం

  టాలీవుడ్‌లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. అందుకే ఆయన తరచూ వాళ్లతో సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాగే, వాళ్లకు ఎన్నో పనులు చేసి పెడుతుంటారు. అప్పుడప్పుడూ కోప్పడినా.. ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఫీల్ అవరు. అలాంటి బాలయ్య తాజాగా తన అభిమానికి నేరుగా ఫోన్ చేసి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.

  Nandamuri Mokshagna To Kick Start His Debut Soon | Filmibeat Telugu
  నేరుగా అభిమానికి కాల్ చేసి అంత మాట

  నేరుగా అభిమానికి కాల్ చేసి అంత మాట

  నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన నందమూరి వీరాభిమాని పత్తి మనోహర్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అక్కడి నాయకులు, ఫ్యాన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. నేరుగా అతడికి ఫోన్ చేశారు. ‘నువ్వు మామూలూ మనిషివి అవుతావు. ఏ భయం పెట్టుకోవద్దు. నీకు నేను అండగా ఉంటాను' అని చెప్పారు. దీంతో మనోహర్ కంటతడి పెట్టుకున్నాడు.

  English summary
  Nandamuri Balakrishna’s upcoming project with Boyapati Srinu. Popular referred to as ‘BB3’, the high-octane actioner will be hitting the worldwide theaters on May 28th, 2021, and clashing with Ravi Teja’s Khiladi at the box-office.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X