»   » బాలకృష్ణ ఆలోచన అలా ఉందా?? లేక పుకార్లేనా? అందరి దృష్టీ ఆ "యాగం" మీదే

బాలకృష్ణ ఆలోచన అలా ఉందా?? లేక పుకార్లేనా? అందరి దృష్టీ ఆ "యాగం" మీదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి హీరో బాలకృష్ణకి కాస్త నమ్మకాలు ఎక్కువే. స్వయంగా జాతకాలు చూసి ముహుర్తాలు కూడా పెట్టటం బాలయ్యకు తెలిసిన విద్యే. అంతే కాదు కొన్ని నమ్మకాల పట్ల చాలా పక్కాగా ఉంటాడన్న సంగతి సన్నిహితులందరికీ తెలుసు. మామూలుగానే పూజలు చేసే అలవాటున్న బాలకృష్ణ ఉన్నట్టుండీ ఏకంగా ఒక యాగమే చేయించాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వియ్యంకుడు, నందమూరి నటసింహం ... బాలకృష్ణ సతీసమేతంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. బాలయ్య "కాలసర్ప దోష నివారణ'' పూజలు చేశాడు అని తెలుస్తోంది.

అయితే ఆ యాగం మామూలుదైతే మనం పెద్దగా పట్టించుకునే అవసరం ఉండదు కానీ "కాలసర్ప దోష నివారణ'' యాగం కావటమే ఇక్కడ పాయింటు... ఆయాగం చేస్తే ఏమవుతుందీ అంటే..? టక్కున వినిపించే మాట పదవీయోగం కోసం అని. ఎవరు పడితే వాళ్లు ఈ పూజను చేయరు. అలాంటి యాగాలు చేయగల నేర్పరులే ఈ కాలసర్ప దోష నివారణ పూజలు చేయగలరు. కాగా, ఇక, కొంతకాలమే ఇండస్ట్రీలో ఉండి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని బాలయ్యబాబు భావిస్తున్నారట. అందుకే ఈ నందమూరి నటసింహం ప్రస్తుతం తీస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాపైనే బాగా శ్రద్ధ కనబరుస్తున్నాడని చెబుతున్నారు. ఈ యాగం విశేషాలూ, బాలయ్య ఆలోచనల గురించి వినిపిస్తున్న వార్తలూ.., మరి కొన్ని చూద్దాం

 కాలసర్ప దోష నివారణ:

కాలసర్ప దోష నివారణ:


బాలకృష్ణ ప్రముఖ జ్యోతిష్యుడు పరాంకుశం వేణుస్వామి నేతృత్వంలో ‘కాలసర్ప దోష నివారణ' యాగం చేశారు. ఎవరు పడితే వాళ్లు ఈ పూజను చేయరు.అలాంటిది బాలయ్య ఓ ఆశ్రమంలో బాలకృష్ణ దంపతులు నిష్టగా ఈ పూజను చేశారు. పంచె కట్టుకుని నిష్టగా కొన్ని గంటల పాటు కూర్చొని వేద పటనం మధ్య యాగాన్ని పూర్తి చేసాడు.

 రాజ‌కీయంగా అంద‌లాలు :

రాజ‌కీయంగా అంద‌లాలు :


యాగాలు చాలా మందే చేస్తూంటారు కదా..! ఇప్పుడు బాలయ్య ఈ కాలసర్పదోష నివారణ యాగం చేస్తే ఏమయ్యిందీ. అనుకుంటున్నారా. అయితే మీకీ విషయం తెలియాల్సిందే ఈ త‌ర‌హా పూజ‌లు మామూలు పండితులు చేయ‌లేర‌ట‌.. దీనికి నిష్ణాతులైన మ‌హా పండితులు కావాలిట‌... ఈ పూజ‌తో త‌న‌కు దోషాలు పోయి రాజ‌కీయంగా అంద‌లాలు ఎక్కుతాన‌ని బాల‌య్య న‌మ్ముతున్నారు.

 కచ్చితంగా ముఖ్యమంత్రి పదవే :

కచ్చితంగా ముఖ్యమంత్రి పదవే :


ఈ కాల సర్ప దోష నివారణ పూజను పదవీ యోగం కోసమే చేస్తారని.. శాస్త్రం ఎరిగిన వారు చెబుతున్నారు. మరి బాలయ్య టార్గెట్ లోని ఆ పదవి ఏది అంటే.. అయిన వాళ్లు బహుశా మంత్రి పదవి అయ్యుండొచ్చు అంటుంటే.. కాని వాళ్లు మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి పదవే అని అంటున్నారు. అయితే ఇందులో నిజం లేక పోవచ్చుకూడా మరీ చంద్రబాబుని తప్పించి తానే ముఖ్యమంత్రి కావలనుకునేంత ధారుణమైన ఆలోచనలు మాత్రం బాలయ్య లాంటి బోళా మనిషి మనసులోకి రాకపోవచ్చు.

 మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తి

మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తి


అయితే తనకు మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తిని ఇప్పటికే చాటుకుంది నందమూరి నటసింహం. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే తన పార్టీ ఎమ్మెల్యేల దగ్గర తన ఆసక్తిని బాలకృష్ణ బయటపెట్టేసుకున్నాడు. పర్యాటక శాఖ అయితే బావుంటుందనేది కూడా బాలయ్యే బయట పెట్టాడట. మరి ఈ బావమరిది కోరికని తీర్చటానికి ఆ ముఖ్యమంత్రి బావ ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.

 పదవీయోగం కోసం

పదవీయోగం కోసం


ఈ నేపథ్యంలో బాలయ్య సతీసమేతంగా పూజలు చేసి.. దోష నివారణ చేసి.. పదవీయోగం కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నాడు. బాలయ్య ఇంత పెద్ద పూజలు చేసినా.. అక్కడ లోకేష్ దంపతులు కానీ, వియ్యంకులు చంద్రబాబు దంపతులు కానీ కనపడకపోవడంతో.. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత యోగం గురించి చేపట్టిన యాగం అనుకోవాల్సి వస్తోంది.

 ఈ రాజకీయల ప్రభావం :

ఈ రాజకీయల ప్రభావం :


ఇప్పటికే ఒకవైపు లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం గురించి తర్జనభర్జనలు కొనసాగుతున్న తరుణంలో.. బాలయ్య ఇలాంటి యజ్ఞాలూ యాగాలు చసి సిగ్నల్స్ పంపిస్తూంటే చంద్ర బాబు ఫీలింగ్ ఏమిటో గానీ ఇప్పటికే ఇక తెలుగు దేశం లో చీలిక ఏర్పడుతోందీ అంటూ ప్రతిపక్షాలు చిన్నగా ప్రచారం మొదలు పెట్టాయి. అంతే కాదు ఇప్పుడు ఈ రాజకీయల ప్రభావం బాలయ్య సినిమాల మీద కూడా పడే అవకాశం లేక పోలేదు.

 సినిమాలు చాలించి

సినిమాలు చాలించి "ప్రజా సేవ":


కాగా, ఇక, కొంతకాలమే ఇండస్ట్రీలో ఉండి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని బాలయ్యబాబు భావిస్తున్నారట. ఇప్పటికే వయసుకూడా మీద పడుతూండతం తో ఇక సినిమాలు చాలించి "ప్రజా సేవ" చేయాలనుకుంటున్నాడట. ఎంతైనా పెద్ద ఎన్టీఆర్ కి నిజమైన వారసుడు బాలయ్యే కదా. మరి అంత పెద్ద నాయకుడి వారసుడిగా ముఖ్య మంత్రి కాకున్నా కనీసం మంత్రిగా అయినా ఉండాలనేది బాలకృష్న కోరికేమో. కానీ ఇలా పదవులూ, వాటితో భాధ్యతలూ పెరిగితే సినిమాలు ఆపేస్తాడన్న భయమే అభిమానుల్లో కనబడుతోంది.

 గౌతమిపుత్ర శాతకర్ణి:

గౌతమిపుత్ర శాతకర్ణి:


ఈ నందమూరి నటసింహం ప్రస్తుతం తీస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాపైనే బాగా శ్రద్ధ కనబరుస్తున్నాడని చెబుతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అనేక ప్రాంతాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తెలుగు చక్రవర్తి కావడంతో.. అది తనకు రాజకీయంగా కూడా మరింత మైలేజీని తీసుకొస్తుందని బాలయ్య బాబు భావిస్తున్నాడట.

 మరి ఈ పూజతోనైనా:

మరి ఈ పూజతోనైనా:


కొంతకాలంగా మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నా.. అటు లోకేశ్, ఇటు బాలయ్యకు ఒకేసారి పదవి ఇవ్వలేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దానిని వాయిదా వేస్తూ వస్తున్నారని టాక్. మరి ఈ పూజతోనైనా బాలయ్య బాబు అనుకున్న కోరిక నెరవేరుతుందేమో చూడాలి. మరికొంత మందేమో ఇది ఆయన కోసం కాదు చంద్రబాబు కోసమ.., ఆయన కుమారుడు లోకేష్ కి మంతి పదవి కోసం అంటున్నా. ఈ యాగం ఒకరి కోసం ఇంకొకరు చేసేది కాదనీ, ఎవరు చేస్తే వారికి మాత్రమే ఉపయోగం అని కొందరి పండితుల ఉవాచ... ఇక నిజానిజాలూ... మనకెలా తెలుస్తాయ్

English summary
Someleaked photos of Balakrishna increased speculation. Some say Balayya is performing Kala Sarpa Dosha Nivarana Yagam for powerful political career and get key post in AP CM Chandra Babu Naidu's cabinet as he is planning to expand his team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu