twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదుర్స్ : క్రికెట్ ఆడుతూ బాలకృష్ణ (ఫొటోలు)

    By Srikanya
    |

    అనంతపురం : సంక్రాంతి పండుగను సొంతజిల్లాలో చేసుకున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో సందడి చేశారు. బసవతారకరామారావు స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను బాలయ్య ప్రారంభించారు. యువకులతో కలిసి కాసేపు ఉత్సాహంగా క్రికెట్‌ ఆడారు. క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలని వారికి సూచించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే...క్రీడాకారులు గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలనిఅన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో బసవ తారక రామారావు మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసి క్రీడాకారులను అలరించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కర్ణాటక రాష్ట్రం చింతామణి బాలకృష్ణ అభిమాన సంఘం ముద్రించిన 2015 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బాలకృష్ణ క్రికెట్‌ మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులు, అభిమానులను అలరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ రావిళ్ల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, అబ్దుల్‌ గనీ, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.

    స్లైడ్ షోలో... బాలయ్య క్రికెట్ ఆడుతున్న ఫొటోలు

    బాలకృష్ణ మాట్లాడుతూ....

    బాలకృష్ణ మాట్లాడుతూ....

    ప్రజలు నందమూరిపురంగా పిలుచుకుంటున్న హిందూపురంలో తన తల్లిదండ్రులైన బసవ తారక రామారావు పేరిట క్రికెట్‌ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం అన్నారు.

    అలాగే...

    అలాగే...

    ఈ పోటీల్లో మొత్తం 39 జట్లు పాల్గొనడం చూస్తే క్రీడల పట్ల యువకుల్లో ఉన్న ఉత్సాహం కనిపిస్తోందన్నారు.

    ఏటా బసవతారక రామారావు క్రికెట్‌ టోర్నీ

    ఏటా బసవతారక రామారావు క్రికెట్‌ టోర్నీ

    హిందూపురంలో దివంగతనేత తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పేరిట ఏటా క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

    అభివృద్ది చేస్తా...

    అభివృద్ది చేస్తా...

    విద్యారంగంతో పాటు క్రీడారంగాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.

    36 జట్లు

    36 జట్లు

    ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకొని ఈనెల 5 నుంచి ఎంజీఎం మైదానంలో క్రికెట్‌ టోర్నీ జరిగింది. ఇందులో మొత్తం 36 జట్లు పాల్గొన్నాయి.

    ఫైనల్ మ్యాచ్ కు..

    ఫైనల్ మ్యాచ్ కు..

    ఫైనల్‌ మ్యాచ్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    టాస్ వేసి..

    టాస్ వేసి..

    ఉదయం పైనల్‌కు చేరుకొన్న జట్లను పరిచయం చేసుకొన్న అనంతరం టాస్‌ వేశారు.

    20 ఓవర్లలో

    20 ఓవర్లలో

    పోలీస్‌, హెచ్‌సిఎ జట్లు తలపడగా పోలీస్‌ జట్టు20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. హెచ్‌సిఎ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లనష్టానికి 129 పరుగులు చేసింది..

    పోలీస్ జట్టు విజయం

    పోలీస్ జట్టు విజయం

    పోలీస్‌ జట్టు విజయం సాదించింది. బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా మస్తాన్‌, త్రినాథ్‌ (పోలీస్‌ జట్టు) మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కించుకొన్నాడు.

    బెస్ట్ బౌలర్ గా...

    బెస్ట్ బౌలర్ గా...

    బెస్ట్‌ బౌలర్‌గా హరినాథ్‌ రెడ్డి(హెచ్‌సీఏ) నిలిచారు.

    స్నేహపూర్వక పోటీ

    స్నేహపూర్వక పోటీ

    సాయంత్రం రాజకీయనాయకులు, ప్రెస్‌క్లబ్‌ జట్ల మధ్య స్నేహపూర్వక పోటీ జరిగింది.

    ప్రెస్ క్లబ్ జట్టు

    ప్రెస్ క్లబ్ జట్టు

    ప్రెస్‌క్లబ్‌ జట్టు 89 పరుగులు చేయగా. రాజకీయ నాయకుల జట్టు 14.2 ఓవర్లలో 90 పరుగులు తీసి విజయం సాధించింది.

    బహుమతులు

    బహుమతులు

    బాలయ్య విజేతలకు బహుమతులు అందజేశారు.

    తిలకించేందుకు

    తిలకించేందుకు

    మ్యాచ్‌ తిలకించేందుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, పరిటాల శ్రీరామ్‌, జడ్పీ ఛైర్మన్‌ చమన్‌ హాజరయ్యారు.

    ధన్యవాదాలు

    ధన్యవాదాలు

    ఈ మ్యాచ్‌ చివరిదాకా నడిపిన బాబ్జీ, పండిట్‌, లోక్‌నాథ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

    అభివృద్ధి బాటలో నడిపిస్తా

    అభివృద్ధి బాటలో నడిపిస్తా

    రాజకీయంగా పుట్టినిల్లు అయిన హిందూపురాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ...

    బాలకృష్ణ మాట్లాడుతూ...

    స్వర్గీయ నందమూరి తారకరామారావు హిందూపురం ప్రాంతంలో ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని, తూముగుంట పారిశ్రామిక వాడలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆనాడే నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దారన్నారు.

    సన్మానం

    సన్మానం

    హంద్రీనీవా, పీఏబీఆర్‌ మరమ్మతు పనుల అభివృద్ధి గురించి చర్చిస్తానన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం వారు ఆయన్ను ఘనంగా సన్మానించారు.

    క్రికెట్ తిలకిస్తూనే

    క్రికెట్ తిలకిస్తూనే

    రెండు గంటల పాటు క్రికెట్‌ను తిలకిస్తూ అక్కడే ఓ వైపు నాయకులు, అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

    తెలుసుకున్నారు

    తెలుసుకున్నారు

    పట్టణంలో తాగునీటి వసతి, నియోజకవర్గ సమస్యలపై మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, అబ్దుల్‌ఘని, అంబికా లక్ష్మీనారాయణలను అడిగి తెలుసుకొన్నారు.

    క్యాలెండర్‌ ఆవిష్కరణ

    క్యాలెండర్‌ ఆవిష్కరణ

    అక్కడే కర్ణాటకలోని చింతామణి, తమిళనాడులోని హొసూరుకు చెందిన బాలయ్య అభిమాన సంఘాల వారు వచ్చి బాలయ్యను సన్మానించి ఆయనతో క్యాలెండర్‌ ఆవిష్కరణ చేయించారు.

    ఫించన్ లు

    ఫించన్ లు

    పలువురు పింఛన్‌ అందలేదని రావడంతో అధికారులతో మాట్లాడి అందే విదంగా చూడాలని సూచించారు.

    వార్షికోత్సవంలో...

    వార్షికోత్సవంలో...

    అనంతరం ఎస్‌డిజిఎస్‌ కళాశాల 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. వాసవి విన్నర్స్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆస్పత్రి కమిటీ సభ్యులు, వైద్యులతో చర్చించారు.

    ఆస్పత్రి సమస్యలు

    ఆస్పత్రి సమస్యలు

    ఆస్పత్రి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మోతుకపల్లి వద్ద ఇస్తిమా కోసం చేస్తున్న పనులను పరిశీలించారు.

    బోజనానంతరం...

    బోజనానంతరం...

    ఎంజీఎం మైదానంలో రాజకీయ నాయకులు, ప్రెస్‌ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆడారు. అక్కడే ఏర్పాటు చేసిన సంగీత విభావరి వద్ద ప్రజలు పెద్ద ఎత్తున చేరి తిలకించారు. అనంతరం క్రికెట్‌ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశారు

    English summary
    Natasimha Nandamuri Balakrishna known for his cricketing skills and he was an all-round player . Balayya attended a cricket tournament in his constituency Hindupur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X