»   » మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్: కొడుకు ఎంట్రీపై బాలయ్య ప్రకటన

మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్: కొడుకు ఎంట్రీపై బాలయ్య ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna Confirned His Son' New Movie Launch

బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన చర్చ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో బాలయ్య ఎక్కడికెళ్లినా.... మోక్షజ్ఞను ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఎదురయ్యేవి.

అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఎంతో దూరంలో లేదని, వచ్చే ఏడాది జూన్ నాటికి మోక్షు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని బాలయ్య తెలిపారు. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అభిమానులు మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ ప్రకటన చేశారు.

ఉత్సాహంగా కనిపించిన బాలయ్య

ఉత్సాహంగా కనిపించిన బాలయ్య

మోక్షజ్ఞ జన్మదిన వేడుకల్లో బాలయ్య చాలా ఉత్సాహం కనిపించారు. అభిమానులతో కలసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన స్వయంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ లాంచింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వారందరి కోరికా త్వరలోనే నెరవేరుతుందని చెప్పారు.

ఎంతో దూరం లేదు

ఎంతో దూరం లేదు

తాను ఎక్కడికి వెళ్లినా మోక్షజ్ఞ సినిమా ఎప్పుడన్న ప్రశ్న ఎదురవుతుందని.... ఆ రోజు ఎంతో దూరంలో లేదని, వచ్చే సంవత్సరం జూన్ కెల్లా ఓ మంచి బ్యానరులో తొలి చిత్రం ప్రారంభమవుతుందని బాలయ్య తెలిపారు.

101 చీరల పంపిణీ

101 చీరల పంపిణీ

ఈ పుట్టినరోజు వేడుకలో చీరల పంపిణీ కూడా జరిగింది. తన 101వ చిత్రం 'పైసా వసూల్' విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని 101 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

మీ ఆశీస్సులు కావాలి

మీ ఆశీస్సులు కావాలి

ఆడపడుచులకు చీరలు పంచడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, తన కుమారుడు దీర్ఘాయువుతో వర్థిల్లాలని, మీ ఆశీస్సులతో పాటు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ వెంట ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు బాలయ్య తెలిపారు.

English summary
Nandamuri Mokshagna’s launch which has been in circulation for a while seems to have gotten an official time frame now and Nanadmuri Balakrishna revealed in his son birthday celebrations that Mokshagna will be launched in 2018 and that he will be seen on the big screen only after June 2018
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu