For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానం అనే ఆనకట్టలు తెగాయి: బాలయ్య ‘పైసా వసూల్’ స్పీచ్

  By Bojja Kumar
  |

  బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బేనర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్‌'. శ్రియ, కైరా, ముస్కాన్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

  ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ ఆగస్ట్‌ 17న ఖమ్మం ఎస్‌.ఆర్‌. అండ్‌ బి.జి.ఎన్‌.ఆర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు.

  అభిమానం అనే ఆనకట్టలు తెగాయి

  అభిమానం అనే ఆనకట్టలు తెగాయి

  బాలకృష్ణ మాట్లాడుతూ ..... సినిమా అన్నది పార్టీలకు అతీతం. అభిమానులకి అతీతం. ఒక మంచి ఆలోచనతో మంచి దైవ సంకల్పంతో ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. పెద్ద వర్షం పడింది. వెంటనే ఆగిపోతుంది అన్నాను. ఇసుక వేస్తే రాలనంత జనం. అభిమానం అనే ఆనకట్టలు తెంచుకొని మీరంతా తరలి వచ్చారు. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని అన్నారు.

  Balakrishna's Paisa Vasool Stumper Release Date Confirmed
  అభిమానులను దృష్టిలో పెట్టుకుని

  అభిమానులను దృష్టిలో పెట్టుకుని

  మ్యూజిక్‌ హిట్‌ అయితే సినిమా సగం హిట్‌ అయినట్లే. ఈ సినిమాకి అనూప్‌ అద్భుతంగా మ్యూజిక్‌ చేశాడు. నా సినిమా ఎలా వుండాలో, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు.... ఈ సినిమా విషయంలో కూడా అలానే చేశారు అని బాలయ్య అన్నారు.

  మళ్లీ మళ్లీ అడిగితే అదే చెబుతా

  మళ్లీ మళ్లీ అడిగితే అదే చెబుతా

  నన్ను ఎవరైనా నువ్వు ఎవరు? అని అడిగితే భారతీయుడ్ని అని చెప్తాను. మళ్ళీ నువ్వు ఎవరు? అని అడిగితే తెలుగువాడ్ని అని చెప్తాను. ఇంకోసారి నువ్వు ఎవరు? అని అడిగితే.. నేను నందమూరి తారక రామారావు కొడుకుని అని చెప్తాను. మళ్ళీ మళ్ళీ అడిగితే.. నేను అన్నగారి అభిమానిని అని చెప్తాను. నా దృష్టిలో ఆ మహానుభావుడికి ఎవరూ సాటి లేరు... అని బాలయ్య తెలిపారు.

  నాన్నగారి బాటలోనే

  నాన్నగారి బాటలోనే

  సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. నేను ఒక అర్భకుణ్ణి అన్న నినాదంతో నేను కూడా స్ఫూర్తి పొంది 1983 నుండి కూడా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చి నాన్నగారి స్ఫూర్తి ఆదేశంతో హిందుపురం నుండి పోటీ చేయడం జరిగింది. నన్ను అభిమానించి, ఆదరించి ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యేగా నా ప్రజలకి సేవ చేసి వారి రుణం తీర్చుకుంటాను. నా చివరి రక్తపు బొట్టు వరకూ కూడా నా హిందుపురం ప్రజలకి నా జీవితం అంకితం చేస్తాను. ఎందుకంటే నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం అది... అని బాలయ్య అన్నారు.

  నేనూ పాట పాడాను

  నేనూ పాట పాడాను

  ఈ సినిమాకి భాస్కరభట్ల, చిన్నారాయణ అద్భుతమైన పాటలు రాశారు. ఒక పాట నేను పాడాను. అన్న నందమూరి తారక రామారావుగారి 'జీవిత చక్రం'లోని ఒక పాటని 'కంటిచూపు చెప్తోంది.. కొంటె నవ్వు చెప్తోంది ఓ పిల్లా' పాటని రీమిక్స్‌ చేయడం జరిగిందని బాలయ్య తెలిపారు.

  నాకు రీ లాంచింగ్ మూవీ

  నాకు రీ లాంచింగ్ మూవీ

  పూరి జగన్నాథ్‌ సమర్ధుడైన దర్శకుడు. పూరితో ఇది నా మొదటి సినిమా. ఇది 101వ సినిమా అయినా మళ్ళీ ఇది నా ఒకటో సినిమాతో సమానం. మళ్ళీ రీ లాంచింగ్‌ ఆఫ్‌ బాలకృష్ణ అవుతుంది ఈ సినిమా. రీ లాంచింగ్‌ అంటే నా దృష్టిలో ఫ్లాప్‌లు నుండి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఆ సినిమాతో ఊపిరి పోసుకోవడం కాదు. నా విషయంలో రీ లాంచింగ్‌ అంటే దీనిలో నేను కనబడితే.. నే కలబడితే అరె అంతెందుకు నా కటౌట్‌ నిలబెడితే అదే 'పైసా వసూల్‌' 'పైసా వసూల్‌' అనేలా ఈ చిత్రం వుంటుంది. ఇది నా నూట ఒకటో సినిమా. మళ్ళీ నేను ఒక రీ లాంఛింగ్‌లాంటి సినిమా అవుతుంది అని బాలయ్య అన్నారు.

  బాలయ్య స్పీచ్ మీద కామెంట్స్

  ఓవరాల్‌గా బాలయ్య 20 నిమిషాల పాటు కొనసాగించిన స్పీచ్‌లో చాలా విషయాలు టచ్ చేశారు. అయితే బాలయ్య స్పీచ్ మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ వీడియోలో మీరూ ఓ సారి బాలయ్య స్పీచ్ విని మీ కామెంట్ ఏమిటో వెల్లడించండి.

  English summary
  Nandamuri Balakrishna Aggressive Speech at Paisa Vasool Audio Launch. Paisa Vasool Audio Launch event held at khammam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X