తుదిశ్వాస వరకు హరికృష్ణ ఆ రెండింటితోనే.. ఇక లేరన్న వార్తతో షాక్‌లో..

By Rajababu

తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే హరికృష్ణ ఎంతో ఇష్టం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా సమైక ఆంధ్రప్రదేశ్‌లో విశేష సేవలందించారు. ఇలా ప్రజాసేవ, కళామతల్లికి సేవ చేస్తున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందారు. హరికృష్ణ మృతి నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికరమైన అంశాలు..

చైతన్య రథసారథిగా

చైతన్య రథసారథిగా

స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం కోసం వాడిన చైతన్య రథానికి సారథిగా హరికృష్ణ వ్యవహరించాడు. రాష్ట్రం నలువైపులా ఎన్టీఆర్ చేసిన ప్రచారంలో భాగమయ్యాడు. చైతన్య రథాన్ని హరికృష్ణ సమర్ధవంతంగా నడిపించి పార్టీ విజయంలో కీలక పాత్ర వహించాడు.

డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం

డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం

సాధారణంగానే హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఏ సందర్భంలోనైనా స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తాడు. వేగంగా వాహనాన్ని నడపినా ఆయనకు వెహికిల్‌పై పూర్తి కంట్రోల్ ఉంటుంది.

పసుపు రంగు చొక్కా

పసుపు రంగు చొక్కా

అలాగే హరికృష్ణకు పార్టీ చొక్కా కలర్ పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పార్టీ కార్యక్రమాలకు పసుపు చొక్కానే ధరిస్తాడు. ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పసుపు రంగులో ఉంటే టీషర్టులు వేసుకొంటారు.

Recommended Video

Nandamuri Harikrishna's Movie Journey
జీవిత చివరి అంకంలో కూడా

జీవిత చివరి అంకంలో కూడా

మంగళవారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ స్వయంగా వాహనం నడుపుతూ ఉన్నారు. అలాగే పసుపు రంగు టీషర్ట్ ధరించి ఉండటం గమనార్హం. చివరి శ్వాస సమయంలో కూడా ఈ రెండు ఆయనతో ఉండటం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయన ఇక లేరన్న విషయాన్ని తలుచుకొని శోకసంద్రంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X