twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ చివరి లేఖ.. స్వయంగా తన చేతులతో, సెప్టెంబర్ 2 పుట్టిన రోజు వేడుకలు వద్దు!

    |

    Recommended Video

    Nandamuri Harikrishna's Last Letter To His Fans

    నందమూరి హరికృష్ణ నేటి ఉదయం నల్గొండ సమీపంలో అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని శోకం ఎదురుకావడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, పురందేశ్వరి ఇలా కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

    త్వరలో పుట్టినరోజు వేడుకలు

    త్వరలో పుట్టినరోజు వేడుకలు

    హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2 న ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు నిమ్మకూరులో జన్మించారు. మరో కొన్ని రోజుల్లో హరికృష్ణ 62 వ జన్మదిన వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘోరం జరగడం హరికృష్ణ అభిమానులని, కుటుంబ సభ్యులని కలచివేస్తోంది.

    చివరి లేఖ

    చివరి లేఖ

    త్వరలో తన పుట్టిన రోజు వేడుకని పురస్కరించుకుని కొన్ని రోజుల క్రితం హరికృష్ణ స్వయంగా తన స్వహస్తాలతో లేఖ రాశారు. సెప్టెంబర్ 2 న నా పుట్టిన రోజు పురస్కరించుకుని ఇటివంటి వేడుకలు జరపవద్దని మిత్రులని, అభిమానులని కోరుతున్నాను.

    కేరళ వరద బాధితులకు

    కేరళ వరద బాధితులకు

    నా పుట్టి రోజు వేడుకల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు. పుష్ప గుచ్చాలు తీసుకుని రావద్దు అని రాశారు. వాటికీ అయ్యే ఖర్చు కేరళలో నష్టపోయిన వరదబాధితులకు అందించాలని హరికృష్ణ కోరారు. ఆశ్రయం కోల్పోయిన వారికి దుస్తులు, నిత్యావసర వస్తువులు మీ శక్తిమేరకు అందజేయాలని కోరుతున్నాను అంటూ హరికృష్ణ చివరగా లేఖ రాశారు.

    మీడియాకు

    మీడియాకు

    ఆ లేఖ మీడియాకు విడుదల కాక ముందే హరికృష్ణ ప్రమాదానికి గురై మరణించారు. హరికృష్ణ మరణవార్త తెలియడంతో సినీప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపేందుకు కామినేని ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

    English summary
    Nandamuri Harikrishna last letter to his fans. Request his fans to help Kerala Flood affected people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X