»   » ఫ్యామిలీ విషయానికొస్తే ఊరుకోను: కళ్యాణ్ రామ్

ఫ్యామిలీ విషయానికొస్తే ఊరుకోను: కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘షేర్' చిత్రం ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు సినిమాకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు ఆయన తీవ్రంగా స్పందించారు. నేను ఏ విషయానికీ అంతగా స్పందించను. కానీ నా కేరక్టర్‌ విషయానికొస్తే ఒప్పుకోను. నా ఫ్యామిలీ గురించి ఎవరైనా పాయింట్‌ అవుట్‌ చేస్తున్నారని తెలిస్తే ఎమోషన్‌ అవుతా. నా నేచర్‌ అది'' అని చెప్పుకొచ్చారు.

షేర్ సినిమా గురించిన వివరాలు చెబుతూ...ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. పటాస్‌ చేయడానికి ముందు ఈ సినిమాను మొదలుపెట్టాం. మంచి ఎంటర్‌టైనర్‌ ఇది. అయినా ‘పటాస్‌' విడుదలైన తర్వాత కొంత వినోదాన్ని జోడించాం. మామూలు పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో ఇందులో నా పాత్ర అలా ఉంటుంది. బీటెక్‌ చదివి తండ్రికి సాయం చేసే పాత్ర. చాలా సోఫిస్టికేటెడ్‌గా ఉంటుంది అన్నారు.

సినిమాలో కొన్ని ట్విస్టులు ఉంటాయి. ‘ఓమ్‌'లో లాగా విపరీతమైన ఫ్లాష్‌ బ్యాక్‌లుండవు. సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుని థియేటర్‌కు వస్తాడో ‘ఓం' ఫలితాలు నాకు తెలియజెప్పాయి. ఆ సినిమా ఫలితాలతో కాస్త బాధపడ్డారు. అయితే ఇపుడు జయాపజాలను సమానంగా తీసుకుంటున్నాను. ‘కిక్‌2' బాగా ఆడకపోయినప్పుడు బాధపడలేదు. పటాస్‌లాంటి హిట్‌ వచ్చిన తర్వాత నా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండటం మామూలే. కానీ పటాస్‌తో ఈ సినిమాను పోల్చవద్దు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా ఈ సినిమాను చూస్తే తప్పకుండా నచ్చుతుంది. మల్లి చాలా బాగా తీశాడు. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి నాతో ఉన్నాడు మల్లి. కాకపోతే ఇక్కడ సక్సెస్‌ కౌంట్స్‌ కాబట్టి అతనికి ఓ పెద్ద విజయం వస్తే బావుంటుంది. ‘షేర్‌'ని సక్సెస్‌ చేస్తే ఆ విజయం మల్లికి వచ్చినట్టే అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఈ చిత్రాన్ని త్వరలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది.

Nandamuri Kalyan Ram's Sher releasing on Oct 30

నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

English summary
Nandamuri Kalyan Ram's Sher releasing on Oct 30. Sher has completed its censor formalities a short while ago in Hyderabad. The movie was given U/A certificate after some minor cuts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu