సొంతగా ఇల్లు కొన్న హీరో నాని, ఖరీదు ఎంతో తెలుసా?
వరుస సినిమాలు, వరుస హిట్లతో దూసుకెలుతున్న హీరో నాని ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు
హైదరాబాద్: వరుస సినిమాలు, వరుస హిట్లతో దూసుకెలుతున్న హీరో నాని ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కాస్లీ ఏరియాలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేశాడు. త్వరలోనే నాని ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నాని సొంత ఇల్లును కొనుగోలు చేసిన విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ విల్లా ఖరీరు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్నాళ్లు రెంటెడ్ హౌస్ లో ఉన్న తమ హీరో త్వరలో సొంతింట్లోకి వెలుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాని ‘నిన్ను కోరి'
నాని ప్రస్తుతం ‘నిన్ను కోరి' అనే సినిమాలో నటిస్తున్నాడు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'.

టీజర్ రెస్పాన్స్ అదుర్స్
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ కనిపించే ఈ టీజర్‌లో నాని వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ. అన్ని అలవాట్లు వున్నవాళ్ళని ప్రేమిస్తారు.. ఏ అలవాట్లూ లేనివాడ్ని పెళ్ళి చేసుకుంటారు' అనే డైలాగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

జులై 7న విడుదల
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న 'నిన్నుకోరి' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











