»   » ‘పెళ్లిచూపులు’లకు చీఫ్ గెస్ట్ గా హీరో నాని, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!

‘పెళ్లిచూపులు’లకు చీఫ్ గెస్ట్ గా హీరో నాని, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'పెళ్లిచూపులు'. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో నాని ముఖ్య అథితిగా హాజరుకానున్నారు.

ఈవిషయాన్ని చిత్ర హీరోయిన్ రీతూవర్మ తన ఫేస్‌బుక్‌ఖాతాలో వెల్లడించింది. రాజ్‌ కందుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

Nani cheief guest to Pellichoopulu poster release

ఈ విషయం ప్రక్కన పెడితే.. రీసెంట్ గా జెంటిల్ మెన్ చిత్రంలో అందం, చక్కని అభినయంతో ఆకట్టుకుంటున్న నటి నివేదా థామస్‌. ఈ ముద్దుగుమ్మ తనలో చిత్రకళా ప్రతిభ దాగి ఉందని నిరూపించుకుంది. 'జెంటిల్‌మన్‌' నానికి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను పంపించింది. అదేంటో తెలుసా..! స్వయానా నివేదా గీసినా నాని బొమ్మను ఫ్రేమ్‌ కట్టించి బహుమతిగా ఇచ్చింది.

ఈ విషయాన్ని నాని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించి.. స్కెచ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. 'జై లేదా గౌతమ్‌.. వీరిద్దరిలో ఎవరు మీకు ఇష్టమైన వ్యక్తి అంటూ' నాని పోస్ట్‌ చేశాడు. నాని, నివేదా జంటగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన 'జెంటిల్‌మన్‌' చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.

English summary
Actor Vijay Devarakonda, has teamed up with film-maker Tharun Bhaskar for a new movie. Produced jointly by Raj Kandukuri and S Rangineni. It’s going to be an out-and-out commercial entertainer." Titled Pelli Choopulu, the film has music by Vivek Sagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu