»   » తెలివిగా చంపాలి అంటున్న నాని (‘జెంటిల్‌మన్‌’ ట్రైలర్)

తెలివిగా చంపాలి అంటున్న నాని (‘జెంటిల్‌మన్‌’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'జెంటిల్‌మన్‌'. హీరోనా... విలనా...? అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న నేచురల్ స్టార్ నాని జెంటిల్ మన్ చిత్రం ఆడియో ఫంక్షన్ నిన్న జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు.

Nani Gentleman Movie Theatrical Trailer

అయితే ఈ జెంటిల్‌మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వచ్చిన 'అష్టా చమ్మా' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'జెంటిల్‌మన్'.


బాలకృష్ణతో 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చాలా విరామం తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురభి, నివేదా థామస్ హీరోయిన్.


నిర్మాత మాట్లాడుతూ- ''అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులూ చూసేలా తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల విడుదలైన మా చిత్రం తొలి టీజర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


Nani Gentleman Movie Theatrical Trailer

తను హీరోనా? విల‌నా? అనే క‌న్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటాడ‌ట హీరో. పైకి జెంటిల్ మేన్ గా క‌నిపిస్తున్నాడు కానీ లోప‌ల మాత్రం పెద్ద క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ నాని. 'జెంటిల్ మ‌న్' చిత్రం మ‌ర్డ‌ర్ మిస్ట‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతోంది.


అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

English summary
Watch the theatrical trailer of the film Nani's Gentleman.The film is being directed by Indraganti Mohan Krishna and produced by Sivalanka Krishna Prasad. The music of the movie is composed by Manisharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu