»   » నాని కోరిక.. ఏకంగా చిరంజీవి సినిమానే రీమేక్ చేయాలనుందట..!

నాని కోరిక.. ఏకంగా చిరంజీవి సినిమానే రీమేక్ చేయాలనుందట..!

Subscribe to Filmibeat Telugu

అ ! సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఆసక్తికరమైన కోరికని బయట పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాని రీమేక్ చేయాలనే తన కోరిక వెళ్లబుచ్చాడు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు. మెగాస్టార్ లోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ ఆవిష్కరించిన చిత్రం అది. 80 లలో వచ్చిన చంటబ్బాయ్ చిత్రం చిరులోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది. ది గ్రేట్ జంధ్యాల ఈ చిత్రానికి దర్శకులు.

 చంటబ్బాయ్ ని కొత్తగా

చంటబ్బాయ్ ని కొత్తగా

అ ! చిత్ర ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్న నానికి ఇంట్వ్యూ లో ఓ ప్రశ్న ఎదురైంది. రీమేక్ చేయాలంటే ఈ చిత్రాన్ని ఎంచుకుంటారు అని అడగగా నాని ఈ సమాధానం ఇచ్చాడు. మెగాస్టార్ చిరు నటించిన చంటబ్బాయ్ సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తన మైండ్ లో ఉందని నాని తెలిపాడు.

 మెగాస్టార్ ని సరికొత్తగా

మెగాస్టార్ ని సరికొత్తగా

ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యాల ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించారు. చిరులోని కామెడీ యాంగిల్ ని ఆయన విజయవంతంగా వెండి తెరపై ఆవిష్కరించారు.

 నాని చేస్తే ఎలా ఉంటుంది

నాని చేస్తే ఎలా ఉంటుంది

కామెడీ పండించడంలో నానిది సరికొత్త శైలి. చంటబ్బాయ్ చిత్రంలో మెగాస్టార్ పోషించిన డిటెక్టివ్ రోల్ కి నాని కచ్చితంగా సూటవుతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నిర్మాతగా కొత్త అవతారం

నిర్మాతగా కొత్త అవతారం

హీరోగా వరుసపెట్టి హిట్లు కొడుతున్న నాని, తొలిసారి నిర్మాతగా మారి అ ! చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రమోషన్ లో కూడా పాల్గొంటూ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు.

 ఆసక్తి రేపుతున్న అ !

ఆసక్తి రేపుతున్న అ !

కాజల్, నిత్య మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల వంటి స్టార్లంతా ఈ చిత్రం లో నటించారు. ఈ చిత్రం ఈ జోనర్ కు చెందినది, ఎవరెవరు ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు అనేది అంతా సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవలసిందే. నాని అయితే చేపకు వాయిస్ ఓవర్ ఇచ్చి షాక్ కి గురి చేసాడు.

English summary
Nani interested to remake megastar Chiranjeevi's movie. Nani revels this in an interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu