Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాని 'జెండాపై కపిరాజు' కాన్సెప్టు
హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.
ఇందులో తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.
నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు. ఈ వారంలో ఆఖరి షెడ్యూలు మొదలవుతుందని తెలిపారు.
అమలాపాల్ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామ్ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్, శివబాలాజీ, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్, కూర్పు: ఫాజల్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్.