»   »  హీరో నాని...జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పిస్తాడంటూ కామెంట్

హీరో నాని...జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పిస్తాడంటూ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'వీడు మాములోడు కాదే. జండూబామ్‌కు కూడా తలనొప్పి తెప్పించే రకం' అంటూ నాని ని ఆయన అనేసారు. ఎవరు ఇంతకీ నానిపై అంత కామెంట్ చేసింది అంటారా...అయితే ఇది మీరు చదవాల్సిందే.

నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నేను లోకల్‌'. కీర్తిసురేశ్‌ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి నాని చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి సందర్భంగా కాకినాడలో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నాని చెప్తున్న డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Nani lately is coming up with Nenu Local and its trailer is released

''ఒక అమ్మాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటోందంటే.. అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్‌ అని అర్థం. ద రిలేషన్‌ షిప్‌ బిట్విన్‌ మార్చి అండ్‌ సెప్టెంబర్‌ షుడ్‌ బి లైక్‌ ఎ ఫిష్‌'' అంటూ నవ్విస్తున్నారు నాని.


'పరిగెత్తి.. పరిగెత్తి బతికేదానిని జింకా అంటారు. ఆగి.. ఆగి.. కొట్టేదాన్ని పులి అంటారు' అంటూ నాని చెప్పి మరో డైలాగ్‌ వింటుంటే యాక్షన్‌ సన్నివేశాలకూ మంచి ప్రాధాన్యమిచ్చినట్లు అర్థమవుతోంది. మరోప్రక్క దేవిశ్రీప్రసాద్‌ అందించిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

నాని మాట్లాడుతూ.. 'సముద్రం అటుందో ఇటుందో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో ఉంటే 'నేను లోకల్‌' అని చెప్పేవాడిని. మీరు చెప్పండి. 'నేను లోకల్‌' అని. సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్ మొత్తం కోరుకుంటున్నాం. కానీ కాకినాడ విషయంలో మాకు పెద్ద టెన్షన్‌ లేదు ఎందుకంటే.. ఇక్కడున్న వాళ్లు సినిమా చూసినా చాలు 150 రోజులు ఆడుతుంది. ఈ కార్యక్రమానికి వస్తుంటే కాకినాడ దేనికి ప్రత్యేకం అని కీర్తి సురేశ్‌ అడిగింది.

కాకినాడ కాజా అని చెప్పా. కాజా అంటే ఏమిటి అడిగింది. అది ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. దాన్ని తిని ఆ రుచిని తెలుసుకోవాల్సిందే. 'నేను లోకల్‌' గురించి కూడా ఏం చెప్పాలో తెలియడం లేదు. దానిని థియేటర్‌లో చూసి తెలుసుకోవాల్సిందే. దిల్‌రాజుతో సినిమా చేయాలని ఎప్పటినుంచే అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషించారు.

నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఈ అమ్మాయి ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అని కోరుకున్న సందర్భాలున్నాయి. కానీ కీర్తి సురేశ్‌ను చూసిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగా చేస్తోంది. నేను ఇంకా ఎంత బాగా చేయాలో అనుకునేవాడిని. మా సినిమా రచయిత ప్రసన్న, సాయికృష్ణలు ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా రచించారు. అందరూ చాలా కష్టపడి పనిచేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన పాటలతో నాతో డ్యాన్స్‌ చేయించారు.' అని అన్నారు.

English summary
Nani lately is coming up with Nenu Local and its trailer is released. Produced by Dil Raju, this film features Keerthy Suresh as the female lead
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu