»   »  నాని 'భలే భలే మగాడివోయ్‌' ఆడియో విడుదల తేదీ పోస్టర్లు

నాని 'భలే భలే మగాడివోయ్‌' ఆడియో విడుదల తేదీ పోస్టర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'. ఈ చిత్రం ఆడియోను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు.

Bhale Bhale Magadivoi Audio Posters :)

Posted by Actor Nani on 10 August 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ-2, యు.వీ. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'భలే భలే మొగాడివోయ్'. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యిందని, అతి త్వరలోనే వాటినీ చిత్రీకరించి... ఆగస్ట్ రెండోవారంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతనూ అలరిస్తుందని హీరో నాని హామీ ఇస్తున్నాడు. సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో నాని చిన్నపాటి ప్రమాదానికి గురైనా... వెంటనే షూటింగ్ లో పాల్గొని ఎంతో సహకరించాడని డైరెక్టర్ మారుతీ కితాబిచ్చాడు.

Nani's Bhale Bhale Magadivoi Audio will be launched on Aug.15th

'ఈ రోజుల్లో', 'బస్టాప్'తో అడాల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ 'కొత్త జంట'తో ఆ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేశాడు కానీ, పెద్దంత సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'భలే భలే మొగాడివోయ్' ను అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా మారుతీ తెరకెక్కిస్తున్నాడట.

విశేషం ఏమంటే... ఇంతవరకూ తన సినిమాలకు జెబితోనే మ్యూజిక్ చేయించుకున్న మారుతీ ఇప్పుడు మలయాళంలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'తో గోపీ సుందర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 'అందాలరాక్షసి', 'దూసుకెళ్తా' చిత్రాల్లో నటించిన అయోధ్య చిన్నది లావణ్య త్రిపాఠి సైతం మంచి విజయం కోసం ఎదురు చూస్తోంది!

English summary
The audio of Nani's Bhale Bhale Magadivoi will be launched on Aug 15.
Please Wait while comments are loading...