»   »  నాని కొత్త చిత్రం ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల

నాని కొత్త చిత్రం ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్. పి.కిరణ్‌ నిర్మాత. తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేసారు.


'స్టాప్‌ డ్రింకింగ్‌ స్టార్ట్‌ లవింగ్‌' అనే ట్యాగ్‌ లైన్‌తో నాని చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని గ్రామ్‌ఫోన్‌ వద్ద టెడ్డీబేర్‌తో కబుర్లు చెబుతూ ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.
Nani's Majnu first look poster revealed

29 ఏళ్ల క్రితం నాగార్జున హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'మజ్ను' తెరకెక్కింది. మళ్లీ ఆ పేరు ఇటీవల నాగచైతన్య సినిమా విషయంలో వెలుగులోకి వచ్చింది. 'ప్రేమమ్‌' చిత్రానికి 'మజ్ను' అనే పేరే పెట్టబోతున్నారని ప్రచారం సాగింది. కానీ ఆ పేరు నాని సినిమాకి కుదిరింది.

వరుస విజయాలతో జోరుమీదున్న నాని త్వరలోనే 'మజ్ను'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్. పి.కిరణ్‌ నిర్మాత. తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకి 'మజ్ను' అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

English summary
Hero Nani's upcoming movie Majnu first look poster revealed today (30 July). Nani took to micro-blogging site Twitter to reveal the first look of the film by tweeting: "First look ... Today :)".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu