»   » నాని పైకి కనిపించేంత మంచి వాడు కాదు

నాని పైకి కనిపించేంత మంచి వాడు కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'జెంటిల్‌మన్‌'.ముందుగా చెప్పినట్లుగానే ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. నాని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. 'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు' అని ట్వీట్‌ చేశారు.


టీజర్‌ను బట్టి... నాని చిత్రంలో విలన్‌గా కనిపిస్తారా... లేక హీరోగా కనిపిస్తారా అన్న అంశం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.... మా సంస్థ‌లో నాని హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా సినిమాకు జెంటిల్‌మ‌న్ అనే పేరును ఖరారు చేశాం. ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే అంశాలుంటాయి.


Nani's new movie Gentleman Teaser

ఆహ్లాద‌క‌ర‌మైన‌ రొమాన్స్, సెంటిమెంట్, వినోదం త‌గిన మోతాదులో క‌ల‌గ‌లిసి ఉంటాయి. చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌ణిశ‌ర్మ మంచి సంగీతాన్నిచ్చారు. పాట‌ల విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అని అన్నారు.


అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.


English summary
Here comes the first official teaser of Nani's upcoming film 'Gentle Man'. The teaser is intriguing and managed to catch the viewer's attention.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu