»   » నాని ‘జెంటిల్మెన్’ లుక్స్‌తో అదరగొడుతున్నాడు (ఫోటోస్)

నాని ‘జెంటిల్మెన్’ లుక్స్‌తో అదరగొడుతున్నాడు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జెంటిల్‌మ‌న్‌ అనే పేరు పెట్టారు. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. షూటింగ్ పూర్తయింది కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచారు. కొత్త పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే అంశాలుంటాయి. ఆహ్లాద‌క‌ర‌మైన‌ రొమాన్స్, సెంటిమెంట్, వినోదం త‌గిన మోతాదులో క‌ల‌గ‌లిసి ఉంటాయి' అన్నారు.

సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యిందని తెలిపిన నిర్మాత ప్ర‌స్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం చాలా బావుందని, త్వరలోనే ఆడియో రిలీజ్ తేదీని ప్ర‌క‌టిస్తామని తెలిపారు అన్నారు.

సెకండ్ లుక్

సెకండ్ లుక్

తాజాగా విడుదల చేసిన ‘జంటిల్మెన్' సెకండ్ లుక్ ఇదే...

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్

రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన ‘జంటిల్మెన్' ఫస్ట్ లుక్ పోస్టర్.

సెకండ్ లుక్ పోస్టర్

సెకండ్ లుక్ పోస్టర్

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

English summary
Nani's next movie Gentleman 2nd look released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu