Just In
- 4 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 4 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 6 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ ధైర్యం ఎప్పుడూ చేయం.. ఒక్కసారైనా మెగాస్టార్‌తో షేర్ చేసుకోవాలని ఉంది.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు
నాచురల్ స్టార్ నాని మరి కొద్ది రోజుల్లోనే గ్యాంగ్ లీడర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్ మరోసారి తెరపై కనిపించనుండటం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ టైటిల్ గురించి ఓ రేంజ్ చర్చలు కూడా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తమ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నామనే విషయమై స్పందించాడు నాని. ఆ వివరాలేంటో చూద్దామా..

జోరుగా గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్
షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టారు యూనిట్ సభ్యులు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాని, కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రికార్డు స్థాయిలో గ్యాంగ్‌లీడర్ ప్రీ బిజినెస్.. నాని కెరీర్లోనే హయ్యెస్ట్‌గా

దానికి దీనికి పొంతన లేదు
ఇందులో భాగంగా సినిమా పేరు ఖరారైనప్పటి నుంచే చర్చల్లో నిలుస్తున్న 'గ్యాంగ్ లీడర్' టైటిల్ విషయమై ఓపెన్ అయ్యాడు. అప్పట్లో వచ్చిన సినిమా మాస్ అయితే.. ఇది ఎంటర్‌టైనర్ అని ఈ రెండింటికీ ఎక్కడా పొంతన లేదని చెప్పాడు. కథకు బాగా సూట్ అవుతుందనే ఉద్దేశం తోనే ఆ టైటిల్ వాడుకున్నామని అన్నాడు. ఈ టైటిల్ తమ సినిమాకు హెల్ప్ అవుతుందే కానీ ఎప్పుడూ నెగిటివ్ మాత్రం కాదని స్పష్టం చేశాడు.

అయినా ఆ ధైర్యం ఎప్పుడూ చేయం
అయినా గ్యాంగ్ లీడర్ కథను ముట్టుకునే ధైర్యం మాత్రం ఎప్పుడూ చేయం.. చేయలేదు కూడా అన్నాడు నాని. ఇక తనకు ఎవరితో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉండనే విషయాన్ని బయటపెట్టిన ఆయన.. అందరు స్టార్ హీరోలతో చేయాలనుందని చెప్పాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తెర పంచుకోవాలని ఆసక్తిగా ఉందని తెలిపాడు.

గ్యాంగ్ లీడర్ మూవీ
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందింది. చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.