»   » ‘నిన్ను కోరి’ పెద్ద హిట్: థాంక్స్ చెబుతూ నాని సెల్ఫీ వీడియో

‘నిన్ను కోరి’ పెద్ద హిట్: థాంక్స్ చెబుతూ నాని సెల్ఫీ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకదేవుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ నాని ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. నిన్ను కోరి చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా పెద్ద థాంక్స్ చెప్పారు.

యూఎస్ఏలో తొలివారంలోనే 1 మిలియన్ డాలర్స్ దాటించారు. మీకు థాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సెకండ్ వీక్ లో 100కు పైగా సెంటర్స్ లో సినిమా కంటిన్యూ అవుతోంది. ఎవరైనా మిస్సయితే తప్పకుండా చూడండని నాని సూచించారు.ఎంటర్టెన్మెంటుతో పాటు మంచి సినిమాలు చేయడానికి కాంబినేషన్ కుదరడం చాలా రేర్. అలాంటి సినిమా నిన్ను కోరి. మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దామని నాని తెలిపారు.


English summary
"Thanking you all once again for making #NinnuKori a memorable one for us! See you at the success meet" Nani tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu