పవన్ కళ్యాణ్ ని నాని కూడా వాడేస్తున్నాడు

బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ, తెలుగు భాషల్లో తయారవుతోంది. ఈ చిత్రంలో ఓ పాట డైలాగులతో ఉంటుంది. ఆ డైలాగులలో మొదట 'నాకు కొంచెం తిక్క ఉంది, దానికో లెక్క ఉంది, ..' అని వస్తుంది. తర్వాత లైన్ లో 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ ' అనే డైలాగు వస్తుంది. బాగా పాపులర్ అయిన ఈ రెండు డైలాగులు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. ఇదో పార్టీ సాంగ్. ఈ సాంగ్ లో వాణి కపూర్ చాలా హాట్ గా కనిపించనుంది.
'బ్యాండ్ బాజా బారాత్' నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి దక్షిణాది చిత్రమిది. గోకుల్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్. ఈ చిత్రం రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఆ మధ్యన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని, ఈగ సినిమా సూపర్ హిట్ అవడంతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను కూడా నానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నాని నటించిన "జండా పై కపిరాజు", "పైసా" సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
నాని మాట్లాడుతూ... "యశ్‌రాజ్ ఫిలిమ్స్ (వై.ఆర్.ఎఫ్.) తొలి సౌత్ ఇండియన్ మూవీలో హీరోనైనందుకు గర్వంగా ఉంది. ముంబైలో వారి స్టూడియోని సందర్శించడం మరచిపోలేని అనుభూతి. అది పెద్ద ఎగ్జిబిషన్‌ను చూసినట్లే అనిపించింది. వై.ఆర్.ఎఫ్. అధినేత ఆదిత్య చోప్రాతో మూడు గంటల సేపు మాట్లాడే అవకాశం లభించింది. మా సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ సంస్థ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందన్నది అర్థమైంది.ఇప్పటికే ఫ్రీమేక్‌గా రూపొందిన తెలుగు సినిమా ('జబర్‌దస్త్')ని నేను చూడలేదు. " అన్నారు.


Click it and Unblock the Notifications











