»   » నా దొంగనా కొడుకు.. చిన్నారిని నాని అంతమాట అనేశాడేంటి

నా దొంగనా కొడుకు.. చిన్నారిని నాని అంతమాట అనేశాడేంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నానికి మిడిల్ క్లాస్ హీరో అనే పేరుంది. ఆయన పోషించే మధ్య తరగతి యువకుడి పాత్రలను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇటీవల వచ్చిన ఎంసీఏ సినిమా అన్నివర్గాలను అలరించింది. రీల్ లైఫ్‌లో ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో.. రియల్ లైఫ్‌లో కూడా పక్కా ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని చాటుకొంటాడు. తాజాగా తన కుమారుడు మొదటి బర్త్ డే సందర్భంగా, ఉద్యోగిగా తల్లి రిటైర్మెంట్ గురించి నాని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఈ చిన్ని రాస్కెల్‌కి ఏడాది పూర్తయింది. దొంగనా కొడుకు ఈ జున్నుగాడు అని ఎంతో ఆప్యాయతగా తన ప్రేమను చాటుకొన్నాడు. నాని కుమారుడి పుట్టిన రోజు మార్చి 28. ఈ సందర్బంగా నాని ట్వీట్ చేశారు.

అలాగే తన తల్లి గురించి గొప్పగా మరో ట్వీట్ చేశారు. ఫార్మాసిస్ట్‌గా థర్టీ ఇయర్ ఇండస్ట్రీ. ఆమె ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటారు. ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్దంగా ఉంటారు. డాక్టర్లు చాలా ఇష్టపడుతారు. అంతకంటే పేషెంట్లు మరీ ఇష్టపడుతారు. మేము అమితంగా ప్రేమిస్తాం. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఆమె ప్రొఫెషనల్ ఈ రోజు చివరి రోజు. మా అమ్మ అంటే చాలా గర్వం. భూప్రపంచంలో మీ కంటే అందంగా మరెవరూ ఉండరేమో అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (శనివారం) మార్చి 31న తిరుపతిలో జరుగుతున్నది. 8 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతున్నది అని మరో ట్వీట్ చేశారు.

English summary
Krishnarjuna Yudham is an upcoming Telugu film written and directed by Merlapaka Gandhi and starring Nani, in dual role. This movie's pre release function organising on March 31 at Tirupati. Apart from this, Nani tweeted a interesting thing about his son and mother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X