»   » యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ‘నాన్నకు ప్రేమతో’

యూఎస్ఏలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ‘నాన్నకు ప్రేమతో’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్స్ మైల్ స్టోన్ అందుకుంది. ఈ సినిమా బుధవారం విడుదల కాగా... శుక్రవారం నాటికే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్కను అందుకుంది. ఈ సంవత్సరం అతి తక్కువ సమయంలో 1 మిలియన్ మార్కు అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు ఈ చిత్రం దాదాపు 1700 థియేటర్లలో రిలీజ్ చేసారు. భారీ ఓపెనింగ్స్ సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సుకుమార్ నేరేషన్ ఎంతో ఇంటలిజెంట్ గా ఉండటం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్లో 1 మిలియన్ మార్కను అందుకున్న 3వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'. సినీ గెలాక్సీ వారు ఈ చిత్రాన్ని యూఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ సంస్థకు కూడా 1 మిలియన్ మార్కు అందుకున్న 3వ సినిమా ఇది. ఇంతకు ముందు ఈ సంస్థ రిలీజ్ చేసిన మనం, భలే భలే మగాడివోయ్ చిత్రాలు 1 మిలియన్ మార్కు అందుకున్నాయి.


Nannaku Prematho makes it to the 1 million dollar milestone at US box office

నాన్నకు ప్రేమతో' సినిమాకు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ రావడంపై ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు సరైన హిట్ లేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కు దాటలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో పాటు, రూ. 50 కోట్ల మార్కు దాటుతాడని అంటున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Nannaku Prematho crossed the 1 million dollar collection milestone at the USA box office on Friday - Rentrak $985,263; with two non reported locations the film entered 1the prestigious million dollar club. This is the first film of the year to reach there in such a short time!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu