»   » ‘నాన్న ప్రేమతో’ నైజాం రైట్స్ సోల్డ్ ఔట్

‘నాన్న ప్రేమతో’ నైజాం రైట్స్ సోల్డ్ ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. అభిషేక్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నైజాం ఏరియా రైట్స్ దక్కించుకున్నారు. అయితే ఎంత రేటుకు కొన్న విషయం ఇంకా బటయకు రానప్పటికీ భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Nannaku Prematho Nizam rights sold

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల తరఫున విశేష స్పందన రావడంపై ఎన్టీఆర్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. టీజర్‌ను 20 లక్షల మంది వీక్షించడం, 39 వేల లైక్స్‌ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అభిమానుల నుంచి లభించిన ఈ అనూహ్య స్పందన మొత్తం చిత్ర బృందానికి పెద్ద శక్తిని అందించిందంటూ పోస్ట్‌ చేశారు.

ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
The latest reports reveal that the Nizam rights of 'Nannaku Prematho' have been jointly bagged by Abhishek Pictures and Reliance Entertainments.
Please Wait while comments are loading...