»   » ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదల కావడం లేదు

‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి విడుదల కావడం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో' మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించక పోయినప్పటీకీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్లు...హీరోను అబాసు పాలు చేయడంతో పాటు సినిమాపై కూడా కొంత ప్రభావం చూపాయి. ' చాలా రోజులుగా అభిమానులు... సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ ల గురించి అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు అనే అనుకుంటున్నారా..? సినిమా విషయంలో ఏ జరుగుతుందో నాకు కూడా తెలీదు' అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్లో కనిపించింది. అయితే ఇది తాను చేసిన ట్వీట్ కాదని, తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని ఎన్టీఆర్ ప్రకటించారు.


Nannaku Prematho Out Of Sankranthi Race

సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడానికి ఇది కారణం కాక పోయనా.... సినిమాకు సంబంధించిన కొంత వర్క్ పెండింగు ఉండటం వల్లనే వాయిదా వేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత అంటే జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
As per the trade sources it is almost confirmed that NTR's Nannaku Prematho has been postponed. The movie will not be coming out during the Sankranthi festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu