»   »  'నాన్నకు ప్రేమతో' ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో...

'నాన్నకు ప్రేమతో' ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ నటించి సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం ఇప్పుడు సౌత్ ఇండియా లో తప్ప మిగతా ప్రాంతాలన్నిటిలోనూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విడుదల అవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం భాష రాని వారిని కూడా రీచ్ అవుతుంది. ఎక్కువ ప్రాంతాల్లో విడుదల చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటంతో ఎక్కువ రెవిన్యూ జనరేట్ అయ్యే అవకాసం ఉంది.

చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను. ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి 'నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. 'చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన.


నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే. ఈ సినిమాలో 'అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.


ఈ చిత్రం నైజాం ఏరియాలో ఎక్కువ ధియోటర్స్ లో విడుదల కాబోతోంది. 400 స్క్రీన్స్ నైజాం ఏరియాలో రిలీజ్ అవుతూ అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ మరో 40 స్క్రీన్స్ ఈ ఏరియాలో కలుపబోతున్నారు. దాంతో 440 స్క్రీన్స్ తో నైజాంలో విడుదల అవుతోంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో... 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎనిమిది స్క్రీన్స్ లో 7 స్క్రీన్స్ ఆక్యుపై చేయబోతోంది.


Nannaku Prematho with English subtitles

సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 13న వస్తున్న ఈ సినిమా ఎ మేరకు విజయం సాదిస్తుందో చూడాలి. సుకుమార్ తన మార్కు చూపిస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. బాబయ్ తో పోటి పడుతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా రిలిజ్ పెద్ద సవాలే.


''సుకుమార్ కథ రాయడు. జీవితాన్ని రాస్తాడు. సుక్కు నాన్నగారి కొన ఊపిరి నుంచి పుట్టిన కథ ఇది'' అని ఎన్టీఆర్ అన్నారు. ''నేను నటించిన 25వ చిత్రమిది. ఇన్ని చిత్రాలు కాదు కదా అసలు నేను నటుడిని అవుతానని కూడా అనుకోలేదు. నీ వెన్నంటి నేనున్నానని నాకు ధైర్యం చెప్పి పరిశ్రమకి పంపించింది మా నాన్నగారే. ఈ సినిమా తల్లిదండ్రులకి నీరాజనం'' అన్నారు ఎన్టీఆర్‌.


ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..' ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ మిలియన్‌ హిట్స్‌ దాటి దూసుకుపోతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

English summary
‎NannakuPrematho‬ will be Released with English subtitles Outside South India!.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu