»   » సినిమా నటిగా... నన్నపనేని రాజకుమారి

సినిమా నటిగా... నన్నపనేని రాజకుమారి

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు. తారకరత్న, శ్వేతబసు, రచనామౌర్య హీరో హీరోయిన్లుగా వి.యం.సి కంబైన్స్ పతాకంపై ఉదయభాస్కర్ పి. దర్శకత్వంలో రూపొందుతున్న 'విజేత' చిత్రంలో జస్టిస్ పాత్రలో నన్నపనేని నటించారు.

  ఇటీవలే ఆమెపై ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం నిర్మాణానంతర పనుల్లో భాగంగా ప్రస్తుతం రీరికార్డింగ్ శరవేగంగా జరుపుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఆడియో, జనవరిలో సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నామని చెప్పారు.

  చిత్ర సమర్పకుడు దొరస్వామిరాజు మాట్లాడుతూ కథకు ప్రధాన్యమిస్తున్న చిత్రమిదని పేర్కొనగా, వినోదాత్మక కుటుంబ కథా చిత్రమని, ఇందులో ఐదు పాటలు ప్రేక్షకులను అతరిస్తాయని దర్శకుడు ఉదయభాస్కర్ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో కృష్ణుడు, అశోక్ కుమార్, వైజాగ్ ప్రసాద్, సన, చంటి తదితరులు తారాగాణం.

  ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, ఛాయాగ్రహణం: శివరాంరెడ్డి, ఆర్ట్: విజయకృష్ణ, ప్రొ.కంట్రోలర్: పి.వి.శాస్త్రి, సమర్పణ: వి.దొరస్వామిరాజు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉదయ్ భాస్కర్ పి.

  తారకరత్న ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు 'చూడాలని చెప్పాలని' చిత్రంలో కూడా నటిస్తోంది. ఇందులో మాధవి లత హీరోయిన్ ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. అదే విధంగా తారకరత్న హీరోగా 'ఎదురులేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.

  English summary
  Tarakaratna's new movie Title 'Vijetha'. TDP MLC Nannapaneni Rajakumari playing guest role in this movie. P Udaya Bhaskar director of the movie. Sanjana and Swetha Basu Prasad lead heroines. Producer V Doraswamy Raju produce this movie under VMC Combines.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more