Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్యకు బదులు బ్రాహ్మణి, ఆసక్తికర కామెంట్స్ (ఫోటోస్)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు నేడు(జూన్ 10) పండగ రోజు. నందమూరి బాలకృష్ణ 56వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.. సాధారణంగా ప్రతి సంవత్సరం బాలయ్య ఈ రోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉంటారు. అక్కడే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగడంతో పాటు పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఆసుపత్రికోసం నిధుల సేకరణలో భాగంగా బాలయ్య ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో.... బాలయ్యకు బదులు ఆయన కూతురు బ్రాహ్మణి బాధ్యత తీసకున్నారు.
బాలయ్య నిక్‌నేమ్ వెల్లడించిన నారా బ్రాహ్మణి!
మనవడి బర్త్ డే పార్టీలో బాలయ్య గోలగోల, మోక్షజ్ఞ కూడా (ఫోటోస్)
తండ్రికి బదులుగా ఆమె స్వయంగా ఆసుపత్రిలో జరిగే బాలయ్య పుట్టినరోజు సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ తనయ బ్రాహ్మణి, చిత్ర దర్శకుడు క్రిష్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం బ్రాహ్మణి క్యాన్సర్ బాధిత పిల్లలకు కేక్ తినిపించి, పండ్లను పంపిణీ చేశారు.
బ్రాహ్మణి మాట్లాడుతూ సాధారణంగా ఎవరికైనా వయసు అయిపోతుంటే ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ నాన్నగారిలో ఎనర్జీ పెరుగుతుంది. నాన్నగారు 56 సంవత్సరాలను పూర్తి చేసుకుని 57వ ఏట అడుగుపెడుతుండటం ఆనందంగా ఉంది.' అన్నారు.
స్లైడ్ షోలో బ్రాహ్మని చెప్పిన మరిన్ని వివరాలు...ఫోటోస్..

తాతగారి నుండి
‘ఆయన మనవడితో చిన్నపిల్లాడిలా ఆడుకుంటుంటారు. తాతగారు స్వీర్గీయ నందమూరి తారక రామారావుగారు నుండి మానవసేవే మాధవసేవ అనే సూత్రాన్ని పాటిస్తూ ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బసవతారకం హాస్పిటల్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు' అని బ్రాహ్మణి అన్నారు

నాన్నగారి కృషి వల్లే..
‘నాన్నగారి కృషి ఫలితంగానే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇండియాలో బెస్ట్ హాస్పిటల్ గా పేరు సంపాదించుకుంది. ఈ హాస్పిటల్‌కు ఫండ్స్ రైజింగ్ కోసం ఇప్పుడు కూడా ఆయన ఆమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు` అని బ్రహ్మాణి అన్నారు.

క్రిష్...
చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ``బాలకృష్ణగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 56 ఏళ్లను పూర్తి చేసుకున్నారా అనే ప్రశ్న మనసులో ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని మొరాకాలో చిత్రీకరిస్తున్నప్పుడు మాకొక మార్గదర్శిగానే కాకుండా దర్శకుడికి విలువినిస్తూ నిత్యవిద్యార్థిలా వ్యవహరించారు' అన్నారు.

గొప్ప వాల్యూస్ ఉన్న వ్యక్తి
‘యన హీరోగా కంటే వ్యక్తిగతంగా నాకు అనుబంధం ఏర్పడింది. గొప్ప వాల్యూస్ ఉన్న వ్యక్తి. బసవతారకం హాస్పిటల్‌లో ఫండ్స్ రైజింగ్ కార్యక్రమం కోసం ఇప్పుడ అమెరికాలో బిజీగా ఉన్నారు. ఇదే హాస్పిటల్‌లో మా అమ్మగారికి కూడా వైద్యం చేయించాం. ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్స్ లో ఇదొకటి`` అన్నారు క్రిష్.

బసవతారకం హాస్పిటల్ సి.ఇ.ఓ ఆర్.పి.సింగ్ మాట్లాడుతూ
ఇండియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను నిలపడంలో బాలకృష్ణగారి కృషి ఎంతో ఉంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు.