»   » టీజర్ చూస్తే వావ్ అనేలానే ఉంది... నూరుద్దీన్ మొహ‌మ్మ‌ద్ అలీ అని "అప్పట్లో ఒకడుండేవాడు"

టీజర్ చూస్తే వావ్ అనేలానే ఉంది... నూరుద్దీన్ మొహ‌మ్మ‌ద్ అలీ అని "అప్పట్లో ఒకడుండేవాడు"

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో ఒకడుండేవాడు.... ఇంట్రస్టింగ్ గా అనిపించే ఈ టైటిల్ విన్నప్పుడే వెరైటీగా అనిపించింది. దర్శకుడు కొద్దిగా లైన్ చెప్పినప్పుదు కూడా అదే ఇంట్రస్ట్ ని కొనసాగించాడు. ఇప్పుడు టీజర్ కూడా ఆ హైప్ ని ఇంకా పెంచే లాగే కనిపిస్తోంది. నారా రోహిత్‌, శ్రీ విష్ణు ఇద్దద్ద‌రు క‌లిసి న‌టించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త‌న్య హోప్‌, సాష కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రమిది. ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ఈ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఇందులో న‌టించిన న‌టీనటుల చిన్న‌ప్ప‌టి ఫోటోల‌ను చూపించి వాళ్లెవ‌రో క‌నిపెట్టిన వారికి అద్భుత‌మైన బ‌హుమతులను ఇస్తామ‌ని ఇటీవ‌ల ఫేస్ బుక్ లో ఆసక్తి కరమైన పోటీ నిర్వహించారు. బహుమతులు కూడా ఆకర్శణీయంగా ఉండటం తో రెస్పాన్స్ కూదా బాగానే ఉంది. నిజానికి ఈ బిజినెస్ ఐడీఅ పాతదే అయినా సినిమాకోసం వాడతం అన్నదే అద్బుతమైన థాట్ ఈ కాంటెస్ట్ కోసం మ‌రి కొన్ని రోజుల్లో ఇంకా ఆస‌క్తిక‌ర‌మైన ఫోటోల‌ను కూడా పోస్ట్ చేయ‌నున్నారు.

"అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు" చిన్న సినిమా లాగా కనిపిస్తున్నా టీజర్ చూస్తే మాత్రం రిచ్ గానే కనిపిస్తోంది. నారా రోహిత్ స‌మ‌ర్పిస్తున్నారు. 1992-96 మధ్య జరిగే పీరియాడిక్‌ కథ ఇది. పాత బస్తీ నేపథ్యంలో సాగుతుంది ఖచ్చితంగా ఒక హిట్ కొట్టే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా అక్టోబ‌ర్‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. యాక్ష‌న్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ స్పెష‌ల్ పార్టీ పోలీస్ ఆఫీస‌ర్ నూరుద్దీన్ మొహ‌మ్మ‌ద్ అలీగా న‌టించారు. క్రికెట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిగా శ్రీవిష్ణు న‌టించారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Watch & Enjoy Nara Rohit Appatlo Okadundevadu Movie First Look Teaser. Starring : Nara Rohit, Tanya Hope, Sree Vishnu, Posani Krishna Murali, Prabhas Srinu, Rajiv Kanakala and Raghu Karumanchi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu