»   »  పవన్ దర్శకత్వంలో నారా రోహిత్

పవన్ దర్శకత్వంలో నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత అసుర వంటి రీసెంట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. సావిత్రి అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రేమ ఇష్క్ కాదల్ వంటి ప్రేమకథాచిత్రంతో సక్సెస్ సాధించిన పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బి.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nara Rohit film with Pawan Sadineni

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రవణ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నారారోహిత్, శ్రీవిష్ణు, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు పవన్ సాధినేని తదితరులు పాల్గొన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోన్న ఈ చిత్రంలో నారా రోహిత్ రోల్ హైలైట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు అన్నారు. హీరోయిన్ సహా మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.

English summary
Prema Ishq Kadal director Pawan Sadineni is all set to make a film with Nara Rohit.
Please Wait while comments are loading...