»   » పొలిటికల్ ఎంట్రీ: క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

పొలిటికల్ ఎంట్రీ: క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో నారా రోహిత్ తాజా సినిమా 'ప్రతినిధి' పొలిటికల్ అంశాలతో నిండి ఉండటంతో....రాబోయే ఎన్నికల్లో తన బ్రదర్ నారా లోకేష్‌తో పాటు నారా రోహిత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నారా రోహిత్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాలంటే కప్పు టీ తాగడం కాదని చెప్పిన నారా రోహిత్....తన తండ్రి, పెద్దనాన్న రాజకీయాల్లో ఉండి ప్రజలకు చేస్తున్న సేవపై ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమీ లేదని నారా రోహిత్ తేల్చి చెప్పారు.

Nara Rohit Reveals his political plans

నారా రోహిత్ సినిమా కెరీర్ వివరాల్లోకి వెళితే..
బాణం, సోలో చిత్రాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోహిత్....మరో వైపు సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగు పెడుతున్నారు. నల దమయంతి అనే చిత్రాన్ని నిర్మిస్తూ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్నారు.

ఆర్ కె మీడియా సంస్థ అధినేత రవికుమార్ పనస, నారా రోహిత్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముగ్గురు ప్రధాన కథానాయకులు ఉండే ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 'రవి పనస ఫిలిం కార్పోరేషన్' అనే బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆయన శంకర, మద్రాసి, లవర్, రౌడీ ఫెల్లో అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈచిత్రాలన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
There was a buzz that Rohit is going to contest on behalf of TDP along with his cousin Nara Lokesh. Citing the effect of all these rumors, Rohit decided to clear the air. He mentioned that Politics is not his cup of Tea. In addition to this, Rohit mentioned that he is happy that his father and uncle are already doing the job in excellence. He doesn't want to enter into politics for now is what we learn.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu