»   » నారా రోహిత్ ‘అసుర’ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు

నారా రోహిత్ ‘అసుర’ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్, ప్రియా బెనర్జీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అసుర'. నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్స్, కుషాల్ సినిమా, అరన్ మీడియా వర్క్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందింది. శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ నిర్మాతలు. కృష్ణ విజయ్ దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 5న విడుదలవుతోంది. వాస్తవానికి ఈచిత్రాన్ని మే 29 అనుకున్నారు. కానీ వీలు కాక పోవడంతో వారం వాయిదా వేసారు.

Nara Rohit's Asura

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... సాయి కార్తీక్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే థియేట్రికల్ ట్రైలర్‌కు ఫ్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తన తొలి సినిమా నుండి డిఫరెంట్ చిత్రాలను సెలక్ట్ చేసుకుని ప్రేక్షకులను అలరించిన నారా రోహిత్ చేసిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్ని ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాలో నారా రోహిత్ నటనలో మరో యాంగిల్ ను తెరపై చూస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. జూన్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం అన్నారు.

మధు సింగంపల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీం యస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: మురళి కొండేటి, పాటలు వశిష్టశర్మ, కృష్ణకాంత్, సుబ్బరాయశర్మ, డాన్స్: విజయ్, నిర్మాతలు: శ్యామ్ దేవభుక్తుని, కృష్ణ విజయ్, రచన-దర్శకత్వం: కృష్ణ విజయ్.

English summary
Actor Nara Rohit’s Asura is supposed to hit the screens on May 29th, 2015. According to the latest update, the makers of this movie are planning to release the film on June 5th, 2015 across India.
Please Wait while comments are loading...