»   » నిజం..ఇక్కడున్నది నారా రోహిత్ , కాస్త డిఫరెంట్ గా ట్రై చేసాడంతే

నిజం..ఇక్కడున్నది నారా రోహిత్ , కాస్త డిఫరెంట్ గా ట్రై చేసాడంతే

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : విభిన్న తరహా చిత్రాల కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న నారా రోహిత్ మరో డిఫెరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. కథలో రాకుమారి టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ...చాలా డిఫెరెంట్ గా ...తమిళ సినిమాలను గుర్తు చేసేలా, మధురై లుక్ ని ప్రెజెంట్ చేసేలా ఉంది. నమితా ప్రమోద్ ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మహేష్ సూరపనేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

డిఫెరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమా కూడా అంతే డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇళయరాజా, విశాల్ శేఖర్ జాయింట్ గా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న 'కథలో రాకుమారి' ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. నారా రోహిత్ తో పాటు ఈ సినిమాలో నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Nara Rohit's Kathalo Rajakumari first look poster

వాలెంటైన్ డే సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ...సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ప్రశాంతి, నర్రా సౌందర్య, కృష్ణ విజయ్ నిర్మిస్తున్న ఈ సినిమాని రాజేష్ వర్మ సిరువూరి సమర్పించనున్నాడు.

నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలియజేస్తూ.. "కార్తికేయ లాంటి సూపర్ హిట్ తరువాత మళ్ళీ అంతకుమించిన సక్సెస్ ఫుల్ చిత్రం నిర్మించాలనే ఆలోచనతో ఓ నవ్యమైన కథతో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం." అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: జయేష్ నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, సహా నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవ సాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గారం.

English summary
Nara Rohith is appearing in a rustic violent avatar in his new film titled 'Kathalo Rajakumari'. The film's first look poster was released on Valentine's Day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu