»   » ‘ప్రతినిధి’ చిత్రం డైలాగులు, ఏ పార్టీకి లాభం?

‘ప్రతినిధి’ చిత్రం డైలాగులు, ఏ పార్టీకి లాభం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి. సుధా మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి ప్రశాంత్ మండవ దర్శకుడు, గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. నారా రోహిత్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఈచిత్రంలోని డైలాగులు ఎన్నికల వేళ టీడీపీకి ప్లస్సవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాంగ్ సిగ్నల్ అయితే 100 లైసెన్స్ లేకపోతే 200..
ఇంజనీరింగ్ సీట్ అయితే 5 లక్షలు ... డాక్టర్ సీట్ అయితే 50 లక్షలు...
పోలీసుకి అయితే లక్ష ... మినిస్టర్ కి అయితే 10 లక్షలు ..
ఓటు వేయడానికి 500 నుండి 5000 వరకు...
చివరకి గుళ్ళో దేవుడకి కూడా లంచం ......
ఇలా అడుగడుగునా డబ్బుకి న్యాయాన్ని తాకట్టు పెడుతున్న ఈరోజుల్లో గాంధీ గారి సిద్దంతాలు పనిచేయావ్ ........
అందుకే నేనో కొత్త సిద్ధాంతం మొదలు పెట్ట్టాను .....

Nara Rohit's Prathinidhi movie dialogue leaked

నారా రోహిత్ సరసన శుబ్ర అయ్యప్ప కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. తెలుగు దేశం పార్ట అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఆడియో ఆశిష్కరించారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా....కావాలనే ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలతో కూడిన ఈచిత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేయడం....సినిమాలోని అంశాలు ప్రేక్షకులపై ఎంతోకొంత ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

English summary
Actor Nara Rohit, nephew of TDP chief Chandrababu Naidu is the talk of the T town. Well, not him really but the latest dialogue from his upcoming movie "Prathinidhi" that has gone viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu