twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కానీ రౌడీ కాదు... (‘రౌడీ ఫెలో’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తొలినుంచి విభిన్నమైన కథాంశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న హీరో నారా రోహిత్. సూపర్ హిట్స్ రాకపోయినా తనని నమ్మి వస్తున్న నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారిన నారా రోహిత్ మరోసారి తాను అలాంటి విభిన్నమైన కథతోనే వస్తున్నానంటున్నారు. అదే రౌడీ ఫెలో. ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. తొలిరోజు నుంచి ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్సే ఉన్నాయి.

    రౌడిఫెలో కథ...సూపర్ పోలీస్...దుర్గా ప్రసాద్(నారా రోహిత్)కు, పొలిటీషియన్ రానా ప్రతాప్ జాదవ్ కు మధ్య జరిగే ఇగో క్లాషెష్ తో జరిగే కథ ఇది. ఒకరిమీద మరొకరు పై చేయి కోసం...వాళ్లిద్దరూ ఆడే మైండ్ గేమ్స్ తో చిత్రం నిండి ఉంటుంది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగులు ప్రాణం. సినిమాలో హీరో రౌడీకాదు. కానీ రౌడీ ఫెలో ఎందుకయ్యాడో సినిమా చూస్తే తెలుస్తుందని అంటున్నాడు నారా రోహిత్. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రౌడీ ఫెలో'.

    నారా రోహిత్‌, విశాఖా సింగ్‌ జంటగా రూపొందిన ‘రౌడీ ఫెలో' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణచైతన్య ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. మూవీ మిల్స్‌ అండ్‌ సినిమా 5 పతాకంపై ప్రకాశ్‌రెడ్డి నిర్మించారు.

    దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఇది సెన్సిబుల్‌ మూవీ. ‘నేను మనుషుల్ని చూస్తున్నాను, మానవత్వాన్ని కాదు' అనే జిడ్డు కృష్ణమూర్తి మాటల ఇన్‌స్పిరేషన్‌తో తయారు చేసుకున్న కథ ఇది. ‘నేను' నుంచి ‘మనం' వరకు ప్రయాణించే ఓ పోలీస్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ కథ ఈ సినిమా. సరదాగా నడుస్తుంది. మ్యూజిక్‌ చార్ట్స్‌లో ఇందులోని పాటలు ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాయి'' అని చెప్పారు.

    Nara Rohit's Rowdy Fellow Preview

    కృష్ణచైతన్య డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు ఆనందంగా ఉందని విశాఖా సింగ్‌ తెలిపారు.

    హీరో రోహిత్‌ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఈ కథను నాతో చేశాడు చైతన్య. ఇది నాకు మరో భిన్నమైన చిత్రం. మంచి కమర్షియల్‌ ఫిల్మ్‌. కథలోని సారాంశాన్నంతా చెప్పే పాటను సీతారామశాసి్త్రగారు గొప్పగా రాశారు. సన్నీ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు'' అన్నారు.

    సంస్ధ: సినిమా5, మూవీ మిరాకిల్‌
    నటీనటులు: నారా రోహిత్, విశాఖా సింగ్, రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య తదితరులు.
    కెమెరా: ఓం,
    ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌.
    సంగీతం: సన్ని
    కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణచైతన్య
    నిర్మాత: ప్రకాష్ రెడ్డి
    విడుదల తేదీ: 21,నవంబర్ 2014.

    English summary
    Rowdy Fellow is a clean family entertainer that people of all ages can enjoy together and is gearing up for release on the 21st of November, 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X