»   » 'రోహిత్' గట్స్ ఉన్నోడబ్బా!: అదేం మాటలా?.. పెద్ద ప్రయోగమే!

'రోహిత్' గట్స్ ఉన్నోడబ్బా!: అదేం మాటలా?.. పెద్ద ప్రయోగమే!

Subscribe to Filmibeat Telugu

సోకాల్డ్ కమర్షియల్ హీరోల్లా కాకుండా కెరీర్ ఆరంభం నుంచి ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు నారా రోహిత్. తొలి సినిమా 'బాణం' నుంచే వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం మొదలుపెట్టిన రోహిత్.. ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర.. లాంటి కథా వైవిధ్యమున్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇదే బాటలో తాజాగా మరో పెద్ద ప్రయోగానికి సిద్దమైపోయాడు.

ఉగాది నుంచి కొత్త సినిమా..:

ఉగాది నుంచి కొత్త సినిమా..:

శ్రీ వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై పీబీ మంజునాథ్‌ దర్శకత్వంలో రోహిత్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉగాది రోజు ప్రారంభమయ్యే ఈ చిత్రానికి నారాయణరావు అట్లూరి నిర్మాత. వంశీ రాజేష్ కథా మాటలు అందిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అదేం మాటలా?.. పెద్ద ప్రయోగమే..:

అదేం మాటలా?.. పెద్ద ప్రయోగమే..:

ఇక రోహిత్ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ సినిమాలో రోహిత్ నుంచి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదట. అంటే, పక్కా మూగవాడి పాత్రలో నటించనున్నాడన్నమాట. సినిమా ఆసాంతం రోహిత్ కేవలం తన హావభావాలతోనే మెప్పిస్తాడట. డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తో మెప్పించడమంటే మాటలా?.. అందుకే రోహిత్ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడంటున్నారు.

 వైవిధ్యతకే ప్రియారిటీ..:

వైవిధ్యతకే ప్రియారిటీ..:

నిజానికి రోహిత్ తప్ప మరే హీరో ఇలాంటి కథలను ఒప్పుకోకపోయేవాడేమో. పైగా కమర్షియల్ హిట్స్ అంతగా లేని టైమ్ లోనూ రోహిత్ ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గకపోవడం అభినందించదగ్గ విషయమే. హిట్టు-ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఆ క్రమంలో వైవిధ్యతే తన మొదటి ప్రియారిటీ అని తాజా చిత్రం ద్వారా మరోసారి నిరూపించాడు.

ఎక్కడా తగ్గట్లేదు..

ఎక్కడా తగ్గట్లేదు..

కేవలం హీరో పాత్రలే కాదు.. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ కనిపించడానికి రోహిత్ వెనక్కి తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో అలాంటి పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు. మొత్తానికి కథ నచ్చాలే కానీ ఎలాంటి పాత్రకైనా.. ఎంతటి ప్రయోగానికైనా వెనక్కి తగ్గట్లేదని చెప్పకనే చెబుతున్నాడు రోహిత్.

ఇప్పుడైనా హిట్టు కొడుతాడా?:

ఇప్పుడైనా హిట్టు కొడుతాడా?:

రోహిత్ ప్రయోగాల సంగతెలా ఉన్నప్పటికీ.. మంచి హిట్టు పడితేనే ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల అటెన్షన్ మరింత పెరుగుతుంది. కాబట్టి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ కథ-కథనాల పట్ల సరైన జాగ్రత్త తీసుకుంటే.. ఆ దిశగా రోహిత్ సక్సెస్ సాధించవచ్చు. సోలో హీరోగా రోహిత్ ఖాతాలో గట్టి హిట్ ఒకటి ఇప్పటికీ బాకీ ఉండిపోయింది. మరి తాజా చిత్రంతోనైనా ఆ బాకీ తీరుస్తాడేమో చూడాలి.

English summary
Hero Nara Rohith has always come up with experimental roles irrespective of the results. Now, he is getting ready to essay another challenging role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu