twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్ ‘ప్రతినిధి’ ఆడియో విడుదల తేదీ

    By Srikanya
    |

    హైదరాబాద్ : వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ ప్రేక్షకులముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. ఈ చిత్రం ఆడియో నవంబర్ 13న హైదరాబాద్ విడుదల కానుంది. సాయికార్తీక్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

    '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహి అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    రాజకీయ వ్యవస్థను ఎదుర్కునే ఒక సాధారణ వ్యక్తి కోణంలో రోహిత్ పాత్రను రూపొందించారని తెలుస్తుంది. సుధా సినిమాస్ పతాకంపై సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ మండవ దర్శకుడు. మరో ప్రక్క నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రవౌళీ ప్రసాద్ నిర్మిస్తున్న 'శంకర' చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది.

    ఈ సందర్భంగా నిర్మాత చంద్రవౌళి మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన పాట త్వరలో చిత్రీకరిస్తామని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నామని తెలిపారు. ఈ నెలలో ఆడియో విడుదల చేసి నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, కొత్త నిర్మాత అయిన చంద్రవౌళి చక్కగా నిర్మించారని, తన కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని హీరో రోహిత్ తెలిపారు.

    English summary
    Nara Rohith is doing a film loaded with current politics. Titled Pratinidhi, the film has completed shoot. It will have its audio launch on November 13th in Hyderabad. Directed by newcomer Prasanth Mandava and written by Anand Ravi, the film has this promotional line - "One man will stand against all odds."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X