»   » అమేజింగ్ లుక్: నారా రోహిత్ ఇంతలా మారిపోతాడని ఊహించలేదు

అమేజింగ్ లుక్: నారా రోహిత్ ఇంతలా మారిపోతాడని ఊహించలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెరీర్ ఆరంభం నుంచి కొంచెం బొద్దుగానే ఉంటున్నాడు నారా రోహిత్. ఐతే ఈ మధ్య మరీ బరువు పెరిగిపోవడంతో విమర్శలు వచ్చాయి. పైగా అలా బొద్దుగా ఉంటూ పోలీస్ పాత్రలు కూడా చేసేసరికి కొంచం ఎక్కువే ట్రోల్స్ కి గురయ్యాడు రోహిత్. 'బాణం' తర్వాత నేనేమీ బరువు పెరగాలని ప్లాన్‌ చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు తగ్గే పనిలో ఉన్నాను. నా సినిమాలు గ్యాప్‌ లేకుండా విడుదలవుతుం డటంతో బరువు తగ్గినట్టు కనిపించడం లేదు. కాస్తా నిరీక్షిస్తే తగ్గుతాను.అంటూ అభిమానులకు చెప్తూ వస్తున్నాడు.

అంతగా చెప్పిన తర్వాత కూడా 'కథలో రాజకుమారి' సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలోనూ రోహిత్ పాత లుక్ లోనే కనిపించడంతో జనాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. బరువు తగ్గబోతున్నట్లు కొంత కాలం నుంచి చెబుతున్న రోహిత్.. పాత లుక్ లోనే కనిపిస్తున్నాడేంటి అనుకున్నారు. ఐతే వాస్తవానికి ఆ సినిమా రోహిత్ బరువు తగ్గడానికి ముందే చాలా వరకు పూర్తయింది. అందుకే అలా కనిపిస్తున్నాడు రోహిత్.

Nara Rohith Work Outs For His Slim Look

నిజానికి కొన్ని నెలలుగా నెలలుగా రోహిత్ చేస్తున్న కష్టం ఎవ్వరికీ తెలియదు, జిమ్ లోనే గంటల తరబడి గడిపి తన బాడీ షేప్ లోకి తెచ్చాడు. గంటల తరబడి జిమ్ లో వర్కవుట్స్ చేస్తూనే ఉన్నాడు. రోజూ ఉదయం 3 గంటలు.. సాయంత్రం 3-4 గంటలు కష్టపడుతున్నాడు నారా రోహిత్. ఇలా దాదాపు 6 నెలలు వర్కవుట్స్ చేస్తే.. ఇప్పుడు తగిన షేప్ లోకి రాగలిగాడు ఈ హీరో. ఈ సమయంలో 15 కిలోల బరువు తగ్గించుకుని కొత్త లుక్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు కుర్ర హీరోల మల్టీ స్టారర్ మూవీ శమంతకమణి చిత్రంలో తన కొత్త లుక్ లోనే నటిస్తున్నాడు నారా రోహిత్.

ఇలా సన్నబడటానికి 6 నెలలు ఏ మాత్రం గ్యాప్ తీసుకోలేదని జిమ్ లోనే ఖచ్చితమైన టైమింగ్స్ పాటిస్తూ పక్కా ప్లాన్ తో వర్కౌట్లు చేశాడట ఇప్పుడు వస్తున్న శమంతకమణి కాకుండా .. ప్రస్తుతం కథలో రాజకుమారి.. వీరభోగ వసంతరాయలు.. పండగలా వచ్చాడు చిత్రాలలో కూడా నటిస్తున్నాడు నారా రోహిత్.

English summary
Nara Rohit has started his workout for his new transformation recently at Gym under the guidance of a fitness trainer. Reportedly, the actor is spending around some hours daily for his perfect look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu