twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ మాటెత్తిన నరేంద్ర మోడీ.. ఇక కశ్మీర్‌‌పై లుక్కేయండి అంటూ!

    |

    కేవలం దక్షిణాదిలోనే కాదు దేశమంతా టాలీవుడ్ క్రేజ్ మారుమోగుతోంది. బాహుబలి లాంటి భారీ సినిమా వచ్చాక దేశవ్యాప్తంగా అందరి చూపు టాలీవుడ్ పై పడింది. ఈ సినిమా విజయంతో తెలుగు సినిమా పరిశ్రమ డిమాండ్ మరింత పెరిగింది. తెలుగులో వచ్చిన పలు సినిమాలు బాలీవుడ్‌లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని సైతం టాలీవుడ్ గురించి మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.

    ఆర్టికల్ 370 రద్దు

    ఆర్టికల్ 370 రద్దు

    జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు కల్పించే అధికరణ 370, 35ఏలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో జమ్ము కాశ్మీర్‌పై ఇక నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్రానికి సంపూర్ణ హక్కులు లేవు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని దాదాపు అందరూ స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గతంలో జమ్ము కాశ్మీర్ నుంచి గెంటివేయబడిన కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. మిగతా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల వలె జమ్ము కాశ్మీర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ భారతీయుడైనా భూములు కొనుగోలు చేయవచ్చు.

     మనమంతా కలిసి వాటిని డెవలవ్ చేసుకుందాం

    మనమంతా కలిసి వాటిని డెవలవ్ చేసుకుందాం

    ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ దేశంలో భాగమయ్యాయి. దీంతో ఇకపై ఆ ప్రదేశాలు మరింత అభివృద్ధి చెందే అవకాశముందని చెప్పిన మోదీ.. ఇప్పటి నుంచి కాశ్మీర్ లోని సుందరమైన ప్రదేశాలు అందరివీ అని, మనమంతా కలిసి వాటిని డెవలవ్ చేసుకుందాం అన్నాడు ప్రధాని మోడీ.

    టాలీవుడ్, కోలీవుడ్ కూడా భాగం కావాలి

    టాలీవుడ్, కోలీవుడ్ కూడా భాగం కావాలి

    ఈ మేరకు సినిమా షూటింగ్స్ గురించి మాట్లాడిన మోడీ.. ఇకపై టాలీవుడ్, కోలీవుడ్ చిత్రసీమలు జమ్మూ కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో స్వేచ్ఛగా షూటింగ్స్ చేసుకునే అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు.

    స్టూడియోల నిర్మాణం కూడా

    స్టూడియోల నిర్మాణం కూడా


    అంతేకాదు జమ్మూ పరిసర ప్రాంతాల్లో స్టూడియోలు పెట్టడానికి స్థలాలు కూడా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఉత్తరాది సహా దక్షిణాది సినీ పరిశ్రమలోని దర్శక నిర్మాతలు అందరూ ఈ విషయంపై లోతుగా ఆలోచించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

    English summary
    Indian Prime Minister Narendra Modi speech about Article 370 Cancel. On his speech he was talked about Tollywood cini industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X