»   » ‘ది గుడ్ రోడ్’టీంను విష్ చేస్తూ నరేంద్రమోడీ ట్వీట్

‘ది గుడ్ రోడ్’టీంను విష్ చేస్తూ నరేంద్రమోడీ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Narendra Modi tweets his wishes to Oscar entry The Good Road team
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 'ది గుడ్ రోడ్'చిత్ర యూనిట్ సభ్యులను ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. 'ది గుడ్ రోడ్' అనే ఈ గుజరాతీ చిత్రం భారత దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ ఎంట్రీకి ఎంపికయింది. ఈ నేపథ్యంలో మోడీ ఆ చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

పోటీలో మొత్తం 22 చిత్రాలు నిలవగా 'ది గుడ్ రోడ్' చిత్రం ఎంపికయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ ఘోష్, ఇతర జ్యూరీ సబ్యులు దాదాపు 5 గంటల సుధీర్ఘ చర్చల అనంతరం ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసారు. ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది.

కేవల్ కట్రోడియా, సోనాలి కులకర్ణి, అజయ్ గేహి ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి గ్యాన్ కొర్రెయా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. ఆస్కార్ నామినేషన్ రేసులో బాలీవుడ్ నుంచి ది లంచ్ బాక్స్, భాగ్ మిల్కా భాగ్, ఇంగ్లిష్ వింగ్లిష్, కమల్ హాసన్ నటించిన విశ్వరూపం, తెలుగు నుంచి మిధునం, చదువుకోవాలి, మళయాల చిత్రం సెల్యూలాయిడ్ లాంటి చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే వీటన్నింటికంటే 'ది గుడ్ రోడ్' చిత్రాన్ని బెస్ట్ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక చేసారు.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో మహబూబ్ ఖాన్ చిత్రం 'మదర్ ఇండియా'(1957), మీరా నాయర్ చిత్రం 'సలామ్ బాంబే'(1988), అశుతోష్ గోవర్కర్ చిత్రం 'లగాన్'(2001) మాత్రమే ఆస్కార్ నామినేషన్ లెవల్ వరకు వెళ్లాయి.

English summary
"Delighted to know that Gujarati film 'The Good Road' has been chosen to represent India at Oscars. Congrats to cast & crew. My best wishes" Narendra Modi tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu