సెల్ఫీ కోసం ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా అల్లరి నరేష్ (ఫొటో)
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సెల్ఫీలు పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీలు తీయటం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అప్ లోడ్ చెయ్యటం బాగా క్రేజ్ గా మారింది. ఈ సెల్ఫీల క్రేజ్ తో ఎక్కడుంటున్నారో, ఏం చేస్తున్నారో కూడా చూసుకోకుండా...మందుకు వెళ్తూ...ఎందరో మృత్యువాత కూడా పడుతున్నారు కూడా.
కాగా ఇప్పుడు ఈ సెల్ఫీ కాన్సెప్ట్ తో 'సెల్ఫీ రాజా' గా సినిమా చేయనున్నాడట. టైటిల్ కు తగ్గ కధతో మంచి కామెడీని మిక్స్ చేసి సినిమాను తెరక్కించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.గత కొంత కాలంగా సరైన హిట్ లేని నరేష్ కు ఈ సినిమా మళ్ళీ బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారట.

అల్లరి నరేష్ తాజా చిత్రం సెల్ఫీ రాజా. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు నిర్మాతలు. నరేష్ తండ్రి దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











