»   »  బాత్‌రూం వేర్‌తోనే రోడ్డుపైకి వచ్చి,తిరిగింది (వీడియో)

బాత్‌రూం వేర్‌తోనే రోడ్డుపైకి వచ్చి,తిరిగింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: నిరంతరం మన గురించే మాట్లాడుకుంటూండాలి, వార్తల్లో ఉండాలి అంటే ఏదో ఒక సెన్సేషన్ చెయ్యాల్సిందే. ఈ విషయం బాలీవుడ్ భామలకు తెలినంతగా మరొకరుకి తెలియదేమో. ముఖ్యంగా నర్గీస్ ఫక్రి ఈ విషయాల్లో ఆరితేరిపోయింది. తాజాగా ఆమె బాత్రూం వేర్ తోటే ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది.

Nargis Fakhri goes around Mumbai in a bathrobe

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌ నటి నర్గిస్‌ ఫక్రి మొత్తం డిజైనర్ వేర్ మొత్తం తీసేసి , తనకు కంఫర్ట్ గా ఉండే బాత్‌రూం వేర్‌తోనే ముంబయి వీధుల్లో విహరించి వార్తల్లో నిలిచింది.

ఆమె సెక్సీనెస్ రహస్యం ఏమిటో? (ఫోటో ఫీచర్)

ఈ 36 ఏళ్ల సుందరి ఇలా చేయటానికి కారణం తన పర్శనల్ పబ్లిసిటీ మాత్రమే కాదు లెండి.. తాను నటిస్తున్న బాంజో చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇలా చేసింది. ఇందుకు సంభందించిన వీడియో నర్గిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇంతకన్నా హాయి ఇంకేముంటుంది అంటూ పోస్ట్‌ చేసింది. మీరూ ఆ వీడియో చూడండి..ఇంకెందుకు ఆలస్యం.

Nothing feels better than walking around in a bathrobe and slippers in the city. #mumbai #relaxed #setlife #Banjo

A video posted by Nargis Fakhri (@nargisfakhri) on Mar 20, 2016 at 9:24am PDT

ఆ చిత్రం గురించి ఈ సమయంలో నాలుగు ముక్కలు...రవి జాదవ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నర్గిస్‌కి జంటగా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ నటిస్తున్నాడు. ఇందులో నర్గిస్‌ అమెరికా నుంచి వచ్చిన డీజేగా నటిస్తోంది. బాంజోతో పాటు నర్గిస్‌ అజహర్‌, హేరాఫేరీ-3 సినిమాల్లో నటిస్తోంది.

English summary
Bollywood actor Nargis Fakhri recently ditched all the designer wear and picked a comfy bathrobe to walk around the city of Mumbai. The 36-year-old actor posted a video of herself on her Instagram account, in which she is seen walking in a bathrobe and a pair of slippers.Along with the video, she wrote, “Nothing feels better than walking around in a bathrobe and slippers in the city.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu