»   » హీరోయిన్ కు ప్రాణాంతక జబ్బు, అందుకే ఫారిన్ ట్రిప్

హీరోయిన్ కు ప్రాణాంతక జబ్బు, అందుకే ఫారిన్ ట్రిప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొన్ని రోజుల కిందట చెప్పాపట్టకుండా నగ్రీస్ ఫక్రీ ఫారిన్ వెళ్లిపోయింది. దీనికి కారణాలేంటో తెలియలేదు. ప్రియుడు ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి ఆమె ఫారిన్ వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. అయితే తనపై వచ్చిన రూమర్లకు ఫక్రీ ఫుల్ స్టాప్ పెట్టింది.

ఆరోగ్య కారణాలతోనే విదేశాలకు వెళ్లినట్టు ఆమె వెల్లడించింది. తను arsenic and lead poisoning అనే అనారోగ్యంతో బాధపడ్డానని చెప్పింది. ఆ అనారోగ్యం ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు. అది నీటి వల్లా లేక ఫుడ్ వల్లా, ఓల్డ్ బిల్డింగ్ లో పాడైన పైప్ లు ఉన్న చోట ఉండటం వల్లా మరేమో తెలియలేదు.

డాక్టర్లు పరీక్షించి ఈ విషయం చెప్పారు. ఆయన చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ చాలా హై లెవిల్ లో ఉంది. నేను ఏం చేయాలని ఆయన్ని అడిగాను. ఆయన సరిగ్గా చెప్పలేకపోయారు. అప్పుడు నేను నేచురోపతి బేస్ తో ఉన్న ఆయుర్వేదం ఉపయోగించాను. మూలికలు కూడిన కొన్ని మందులు వాడాను. దాదాపు ఆరు నెలలు పాటు ఈ విషయమై రీసెర్చ్ చేసినట్లు చేసి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను. తర్వాత టెస్ట్ చేసి చూసుకుంటే ఆ జబ్బుకు సంభందించిన ఆనవాళ్లే లేవు.

ఆ టెస్ట్ రిపోర్ట్ లు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇదంతా ఎలా జరిగింది అని అడిగారు. ఇదంతా మా అమ్మకి కాన్సర్ సమయంలో నేచురోపతితో చేసిన ట్రీట్ మెంట్ వల్ల నాకు తెలిసింది. ఆమెకు బ్రెస్ట్ కాన్సర్. నా చిన్నప్పుడు జరిగిందా సంఘటన. ఆమెకు నేచురోపతిలోనే నయమైంది. మోడరన్ మెడికల్ సిస్టమ్ లో ఏదో లోపం ఉంది అని చెప్పుకొచ్చింది. మొత్తానికి పెద్ద కంప్లైంట్ నుంచి బయిటపడిందన్నమాట. హ్యాపీయే కదా.

స్లైడ్ షోలో మరిన్న విశేషాలు..

అలిసిపోయిందని

అలిసిపోయిందని

అప్పట్లో నగ్రీస్ ఫక్రీ ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు...ఏడాది కాలంగా వరుసగా మూడు సినిమాల కోసం తీరిక లేకుండా నటించడంతో ఫక్రి అలసిపోయిందని.. అందుకే విశ్రాంతి తీసుకోవడం కోసం విదేశాలకు వెళ్లిందని ఆమె మేనేజర్ తెలిపాడు.

అంతా అలా అనుకున్నారు

అంతా అలా అనుకున్నారు


ఉదయ్ చోప్రా పెళ్లికి నిరాకరించడంతో అలిగి విదేశాలకు వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని అతనన్నాడు.

భాధపడుతూనే

భాధపడుతూనే


విశ్రాంతి లేకుండా షూటింగుల్లో పాల్గొనడం వల్ల నర్గీస్ ఆరోగ్యం దెబ్బ తిందని.. గాయంతో బాధపడుతూ అజహర్ ప్రమోషన్లలో పాల్గొందని ఆమె మేనేజర్ వెల్లడించాడు.

అనుమతి తీసుకునే

అనుమతి తీసుకునే


'హౌస్ ఫుల్-3' నిర్మాత సాజిద్ నదియావాలా అనుమతి తీసుకున్నాక నర్గీస్ నూయార్క్ కు వెళ్లినట్లు అతను తెలిపాడు. నెల రోజులు పాటు నర్గీస్ ఫక్రీ విశ్రాంతి తీసుకుంటుందన్నాడు. తన గురించి లేని పోని రూమర్లు పుట్టించవద్దని కోరాడు. అసలు నిజం ఇదన్నమాట.

మంచి పేరే

మంచి పేరే


‘స్పై' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నర్గీస్‌ ఫక్రి. హారర్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం నర్గీస్‌కు మంచి పేరే తీసుకొచ్చింది.

మరోసారి

మరోసారి

ఇప్పుడు తాజాగా మరో హాలీవుడ్‌ చిత్రంలో నటించడానికి నర్గీస్‌ సిద్ధమవుతోంది. అదే ‘5 వెడ్డింగ్స్‌'.

ఇక్కడే షూటింగ్

ఇక్కడే షూటింగ్


బాలీవుడ్‌ వివాహాలపై పుస్తకం రాయడానికి వచ్చిన ఓ అమెరికన్‌ రచయిత్రి నేపథ్యంలో కథ సాగుతుంది. నమ్రతా సింగ్‌ గుజ్రాల్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

పెద్ద స్టార్స్ తో

పెద్ద స్టార్స్ తో


ఆస్కార్‌ నామినీ కాండీ క్లార్క్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ నామినీ బో డెర్క్‌తో కలిసి నర్గీస్‌ నటిస్తోంది.

కథ నచ్చే

కథ నచ్చే


‘‘బాలీవుడ్‌ నుంచి మరోసారి హాలీవుడ్‌కు చేస్తున్న ఈ ప్రయాణం గురించి చాలా ఆత్రుతగా ఉన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది.

ప్రభావితం చేస్తుంది

ప్రభావితం చేస్తుంది


ఇందులో నేను పోషించే రచయిత్రి పాత్ర అమెరికా దేశస్థురాలే అయినా ఇండియాకి వచ్చాకా తన మూలాలు ఇక్కడ ఉన్నాయని తెలుసుకుంటుంది.
అది ఆమె జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది'' అని చెప్పింది నర్గీస్‌.

సొంత గడ్డపైనా

సొంత గడ్డపైనా


‘‘ఓ పక్క బాలీవుడ్‌లో నటిస్తూనే హాలీవుడ్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చేస్తూనే నా సొంతగడ్డపైనా నటించాలన్నది నా ఆశ'' అంటోంది నర్గీస్‌.

ఈ సంవత్సరంలోనే..

ఈ సంవత్సరంలోనే..

ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అమెరికా, ఇండియాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Finally, Nargis Fakhri revealed the actual reason behind leaving India.The Beauty has been diagnosed with life-threatening disease, Arsenic & Lead Poisoning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu