»   » చిరంజీవితో సినిమా అంటే.. ఏడుకొండలవాడి దగ్గరకు పోయినంత హ్యాపీ

చిరంజీవితో సినిమా అంటే.. ఏడుకొండలవాడి దగ్గరకు పోయినంత హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు వర్మ సినిమా అంటే విలన్ గ్యాంగ్ లోకనిపించే రఫ్ పర్సనాలిటీలలో నర్సింగ్ యాదవ్ ఖచ్చితంగా కనిపించేవాడు. దాదా అన్న పదానికి నిలువెత్తు మీనింగ్ లా కనిపించే నిండైన విగ్రహం, దానికి తగ్గ గొంతూ నర్సింగ్ యాదవ్ ని మంచి విలన్ గా నిలబెట్టాయ్. అయితే కేవలం అక్కడితోనే ఆగిపోలేదు ఆ రఫ్ లుక్ తో కూడా కామెడీ పండించి మరీ కమేడియన్‌గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకథని నిలబెట్టుకున్నాడు. మొత్తం తన కెరీర్ లో దాదాపు 400 సినిమాల్లో నటించినా వయసు మీద పడటం, ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు వచ్చేయటం తో ప్రస్తుతం ఛాన్సులు లేక బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ విశేషాలను పంచుకున్నాడు నర్సింగ్ యాదవ్.

Narsing Yadav about chiranjeevi

''నాకు లైఫ్ ఇచ్చింది రామ్‌గోపాల్ వర్మ. తను, నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. హైదరాబాద్‌లోని న్యూ సైన్స్ కాలేజీలో నేను కొంచెం దాదాగిరి చేస్తూ ఉండేవాణ్ని. అప్పుడు రామ్‌గోపాల్ వర్మ నన్ను చూశాడు. తను డైరెక్టర్ అయ్యాక నన్ను ఆఫీస్‌కు పిలిచి ఆఫర్ ఇచ్చాడు. యాక్టింగ్ అంటే తెలీని నాకు యాక్టింగ్ ఎలా చేయాలో వివరంగా నేర్పించాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎవరైనా కుర్రాడిని వర్మ దగ్గర వదిలిపెడితే చాలు.. గొప్ప హీరో అయిపోతాడు.

'శివ' సినిమా సక్సెస్ అయ్యాక నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవిగారితో ఎక్కువ సినిమాలు చేశాను. ఆయన నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఆయన సినిమాలతో నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సినీరంగంలో నాకు మొదటి మెట్టు రామ్ గోపాల్‌వర్మ అయితే.. రెండో మెట్టు చిరంజీవిగారు. చిరంజీవిగారితో సినిమా అంటే.. ఏడుకొండలవాడి దగ్గరకు పోయినంత హ్యాపీగా ఫీలవుతా.'' అంటూ చెప్పుకొచ్చాడు నర్సింగ్.

English summary
Villon, charector artist Narsing Yadav who became famous by Varma Movies, shared some of his feelings and experiences with Ram Gopal Varma and Chiranjeevi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu