»   » వీర్య దాతగా సుమంత్ న‌రుడా..! డోన‌రుడా! రిలీజ్ డేట్ ఖరారు

వీర్య దాతగా సుమంత్ న‌రుడా..! డోన‌రుడా! రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 27న ఆడియో, నవంబ‌ర్ 4న సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో న‌రుడా..! డోన‌రుడా..! సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌తో పాటు అల్రెడి యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసిన రెండు సాంగ్స్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిన‌ ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ పాట‌ల‌ను అక్టోబ‌ర్ 27న‌, సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం. వీర్య‌దాత‌గా హీరో సుమంత్‌, ఇన్ ఫెర్టిలిటీ స్పెష‌లిస్ట్ డా.ఆంజ‌నేయులు పాత్ర‌లో త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. హీరోయిన్ ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది అన్నారు.


Naruda DONORuda Audio Launch Oct 27th, Release Date Nov 4th

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాతలు వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.

English summary
Sumanth’s bold and brave attempt of Naruda DONORuda based on sperm donation concept has garnered immense curiosity both among film circles and audience. First look posters released by Nagarjuna, trailer unveiled by Mahesh Babu have sustained the excitement. Two of the songs released through Youtube were also lapped by audience. The hilarious entertainer is set for a grand audio launch on October 27th followed by release date locked for November 4th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu