»   » సినిమా పాలిటిక్స్: నట్టికుమార్ సంచనలన వ్యాఖ్యలు

సినిమా పాలిటిక్స్: నట్టికుమార్ సంచనలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత నట్టి కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పెద్ద సినిమాల నిర్మాతలంతా కలిసి చిన్న నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మరోసారి గళం విప్పారు. చిన్న సినిమా పాలిట ఆ 14 మందే విలన్లని ఆరోపించారు. 1400 మంది నిర్మాతలున్న నిర్మాతల మండలిని వారే కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆ 14 మంది పెద్ద నిర్మాతల ఆధ్వర్యంలోనే నిర్మాతల మండలి నడవాలని అందరిపై ఒత్తిడి తెస్తున్నారని...వారి నిర్ణయాలు చిన్న నిర్మాతలను తీవ్రంగా నష్టపరిచే విధంగా ఉంటున్నాయని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిర్మాత సురేష్‌బాబు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలోని థియేటర్లన్నీ తన చేతుల్లోనే ఉన్నట్టుగా ఆయన శాసిస్తున్నారన్నారు.

Natti Kumar's allegations on Suresh Babu

రూ. 16 కోట్లతో ఉన్న కౌన్సిల్‌లో రూ. 5 కోట్లు కాజేశారని, మిగతా రూ. 11 కోట్లు కూడా కాజేసి చిన్న నిర్మాతలను రోడ్డున పడేయాలని ఆయన చూస్తున్నారని నట్టికుమార్‌ ఆరోపించారు. వారిపై 1400 మంది నిర్మాతలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందనారు.

కేవలం రెండు ఛానళ్లకే యాడ్స్ ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా నట్టి కుమార్ తప్పుబట్టారు. ఏ చానల్‌కు ప్రకటన ఇవ్వాలో నిర్మాత ఇష్టమని, ఇలాంటి అనవసరమైన విధానాలు తెచ్చి నిర్మాతల హక్కులకు భంగం కలిగిస్తున్న ఆ 14 మంది నిర్మాతలను సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Producer Natti Kumar has leveled serious allegations against Tollywood biggies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu