»   » రేవ్ పార్టీ... గొడవపై హీరో నవదీప్ వివరణ

రేవ్ పార్టీ... గొడవపై హీరో నవదీప్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో నవదీప్...టాలీవుడ్లో నటుడిగా కంటే, వివాదాలతోనే బాగా ఫేమస్ అయిన యంగ్ యాక్టర్. ఓసారి డ్రంక్ అండ్ డైవ్, మరోసారి అనుమతి లేకుండా బోటు షికారు ఇలా నవదీప్ చుట్టు పలురకాల వివాదాలు ఉన్నాయి. తాజాగా నవదీప్‌‍కు ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరిగింది, పోలీసుల దాడి జరిగిందని, పోలీసులు వచ్చే లోపే నవదీప్ తో పాటు, పలువురు సినీ ప్రముఖులు పరారైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి.

అయితే పోలీసులు దాడి చేసిన విషయం మాత్రం నిజమే. ఈ మేరకు కొన్ని ఫోటోస్ కూడా వివడుదలయ్యాయి. ఈవెంట్ మేనేజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలపై నవదీప్ స్పందించారు.

నాకు అసలు ఫాంహౌస్ లేదని, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొంటే రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేసారంటూ మండి పడ్డారు. మీడియా తీరును తప్పుబడుతూ ట్విట్ల మీద ట్వీట్లు చేసారు. 'ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా, ఇంకోటి వేసేద్దాం, జనాలు నమ్ముతారు, ఆనందిస్తారు, టీఆర్పీ రేటింగులు వస్తాయేమో..' అంటూ నవదీప్ ట్వీట్స్ చేసారు. నవదీప్ ఇంకా ఏమేం ట్వీట్లు చేసారో స్లైడ్ షోలో...

రేవ్ పార్టీ కాదు


రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీతో డిన్నర్ అంటూ నవదీప్ ట్వీట్

టీఆర్పీ రేటింగుల కోసమే...


టీఆర్పీ రేటింగుల కోసమే ఇలా చేసారంటూ నవదీప్ ఫైర్...

రూపాయి ఇస్తే...


మీరు నా పేరు వాడిన ప్రతి సారి రూపాయి ఇస్తే ఇప్పటికి ఫాంహౌస్ కొనేవాడినేమో...

వాడు చెప్పాడని వీడు..వీడు చెప్పాడని ఇంకోడు


వాడు చెప్పాడని వీడు రాసాడంట..వీడు రాసాడని ఇంకోడు రాసాడంటా అంటూ మీడియాపై నవదీప్ ఫైర్.

మీరైనా పనికి రండి


మీరైనా పనికి రండి..నన్ను పక్కనపెట్టి పనికొచ్చే పని చేయండి.

గృహ ప్రవేశాన్ని రేవ్ పార్టీ అంటారా?


గృహ ప్రవేశం వేడుకను రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేసారంటూ ట్వీట్

పాదాభివందనాలు..


నాపై ఇలా ప్రచారం చేసిన మహానుభావులకు పాదాభివందనాలు అంటూ...

టీఆర్పీల కోసం ఏదైనా చేస్తారా?


టీఆర్పీ రేటింగుల కోసం ఏమైనా చేస్తారా? అంటూ నవదీప్ మండిపడ్డారు.

తీవ్రమైన వ్యాఖ్యలు


ఈ క్రమంలో నవదీప్ తీవ్రమైన వ్యాఖ్యలు చసారు.

అమ్మ ఏడ్చేది


నిన్న రాత్రి మా అమ్మ నాతో లేకుంటే మీరు చెప్పేది విని ఏడ్చేది, ఆమెకు ఎవరు సమాధానం చెబుతారు?

ఇదీ సంగతి


రాత్రి అక్కడ జరిగింది ఇదే అంటూ నవదీప్ ట్వీట్స్...

పోలీసుల దాడి దృశ్యాలు

పోలీసుల దాడి దృశ్యాలు


పోలీసులు దాడి చేసిన దృశ్యాలు ఇవి.

English summary
"Hilarious news of the day! Dinner with parents and families - rave party! When questioned about it say "cant name my sources!" Navadeep tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu